కొత్త డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ కొత్త సినిమా…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోల్లో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ఒకరు ఈయన గత ఏడాది బింబిసారా సినిమాతో మంచి విజయం అందుకున్నాడు ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన అమీగోస్( Amigos ) సినిమా ప్లాప్ అయింది.
అయితే ఇప్పడూ మరో కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు కళ్యాణ్ రామ్.
ఈయన చేసిన సినిమాలు అన్ని కూడా చాలా బాగున్నప్పటికీ ఎందుకు ప్రేక్షకులను అలరించావో ఎవరికీ తెలీదు అయితే కళ్యాణ్ రామ్ ఎక్కువ గా కొత్త డైరెక్టర్ లకి అవకాశం ఇస్తూ ఉంటాడు.
"""/" /
ఇప్పటి వరకు ఆయనకి సక్సెస్ లు ఇచ్చిన ప్రతి డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ కావడం విశేషం అనే చెప్పాలి.
అయితే కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.
ఆయన ఎవరు అనేది ఇంకా క్లారిటీ గా తెలీదు కానీ పూరి జగన్నాధ్( Puri Jagannadh ) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఒక వ్యక్తిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఈయన సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.
నిజానికి పూరి తో చేసిన ఇజం సినిమా టైం లో పూరి దగ్గ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసిన ఆ అబ్బాయి చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చడం తో ఆయనతో సినిమా చేయడానికి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది.
"""/" /
ఇక అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా ముగిసిన వెంటనే ఆయన ఈ సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.
నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద గా విజయం సాధించలేకపోతున్నాయి.
చూడాలి మరి ఈ సినిమా అయిన విజయం సాధిస్తుందా లేదా అనేది.
Birthright Citizenship : ట్రంప్ నిర్ణయంపై భారత సంతతి నేతల ఫైర్