బింబిసార పాన్ ఇండియా రిలీజ్ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ సినిమా బింబిసార.యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.

ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

ఆగష్టు 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసింది.అయితే కళ్యాణ్ రామ్ ఒక్కడితో ఇది మరింత హైప్ తెచ్చుకోవడం కష్టమే.

దీంతో ఈ సినిమా కోసం తన తమ్ముడు ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాడు కళ్యాణ్ రామ్.

అంతా అనుకున్నట్టే తారక్ రాకతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.దీంతో నందమూరి ప్రేక్షకులు మాత్రమే కాదు.

మరికొంత మంది కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆడియెన్స్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. """/" / రిలీజ్ కు ముందు ఎన్ని ప్రొమోషన్స్ చేసిన అవి ఓపెనింగ్స్ కు మాత్రమే ఉపయోగ పడుతున్నాయి.

ఆ తర్వాత కూడా కలెక్షన్స్ కంటిన్యూ అవ్వాలంటే మాత్రం సరైన కంటెంట్ ఉండాలి.

అలా ఉన్న సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి.మరి ఈ సినిమా కూడా కంటెంట్ పరంగా ఎలా ఉంటుందో చూసిన తర్వాతనే ఆడియెన్స్ ఇది హిట్టో ప్లాపో డిసైడ్ చేస్తారు.

అందుకే మేకర్స్ కూడా ఈ సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

బింబిసార మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన రిజల్ట్ ను బట్టి పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.

ఇక్కడ హిట్ అయితే ఈ సినిమాను డబ్ చేసి ఆగష్టు రెండవ వారంలో రీ రిలీజ్ చేస్తామని మేకర్స్ భావిస్తున్నారు.

మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

ప్రేమ వ్యవహారం విషాదాంతం..యువకుడి ఆత్మహత్య