ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడని క్లైమాక్స్.. కళ్యాణ్ రామ్ కామెంట్లతో అంచనాలు పెరిగాయిగా!

టాలీవుడ్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Nandamuri Hero Kalyan Ram ), అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటి విజయశాంతి( Actress Vijayashanti ) కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి.

ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాకు దశకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇందులో కళ్యాణ్ రామ్, విజయశాంతితో పాటు సోహైల్ ఖాన్, సయీ మంజరేకర్ లు కీలక పాత్రలో నటించారు.

ఇకపోతే ఈ సినిమా ఈనెల అనగా ఏప్రిల్ 18వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

"""/" / విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.అటు విజయశాంతి ఇటు కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటూ సినిమాలపై హైప్ ని పెంచేస్తున్నారు.

ఇదిగా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ సుమ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుమ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

అయితే ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ సినిమా నుంచి మేము ఏదైనా భారీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చా అని ప్రశ్నించగా.

తప్పకుండా ఈ సినిమా ఒక ఎమోషనల్ గా ఉంటుంది. """/" / తల్లిని ప్రేమించే కూతురు గాని కొడుకు గాని ఎవరైనా తల్లి మీద ప్రేమ ఉన్నవారికి తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది ఈ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా కంటతడి పెట్టుకుంటారు ఇది నేను కచ్చితంగా చెబుతాను.

అలాగే సినిమాలో క్లైమాక్స్ చివరి లాస్ట్ 20 నిమిషాలు హైలెట్ గా ఉంటుంది.

అంతేకాకుండా ఆ క్లైమాక్స్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ సినిమాకు ఉండని క్లైమాక్స్ ఉంటుంది.

ఇలా చెప్పడం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా పర్లేదు కానీ నిజంగా చెబుతున్నాను ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం ఇప్పటివరకు ఏ సినిమాలో లేదు అంతలా ఉండబోతోంది.

తప్పకుండా చూడండి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు అని తెలిపారు కళ్యాణ్ రామ్.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఇప్పటికే ఈ సినిమాపై బోలెడు అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పుడు కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.