నందమూరి ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ ఔట్!

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కళ్యాణ్ రామ్ ఇటీవల బింబి సారా, అమిగోస్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇక బింబిసారా సినిమా విషయానికి వస్తే.బింబిసారా సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అతిపెద్దహితిగా నిలిచిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది.

ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్గా వశిష్టకు కూడా మంచి పేరు వచ్చిన విషయం తెలిసిందే.

"""/" / అయితే మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో రెండవ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

కాగా బింబిసారా పార్ట్ 2 ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని కళ్యాణ్ రామ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం మొదటి భాగానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వశిష్ట రెండవ భాగానికి దర్శకత్వం వహించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా యూనిట్ అలాగే వశిష్టకు మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకుని వేరే ప్రాజెక్టులు మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

"""/" / వశిష్ట అలాగే కళ్యాణ్ రామ్ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని ఈ మేరకు ముందుకు వెళ్లడానికే సిద్ధమయ్యారని తెలుస్తోంది.

అయితే ఇందుకు సంబంధించిన విషయాన్ని చిత్ర యూనిట్ కి అత్యంత దగ్గరగా ఉండే ఒక వ్యక్తి తెలిపినట్టు తెలుస్తోంది.

కాగా బింబిసారా రెండో బాగానికి డైరెక్టర్గా అనిల్ పాదూరిని తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే అంతవరకు వేచి చూడాల్సిందే మరి.

కొరియన్, మలయాళం భాషల్లో అనర్గళంగా మాట్లాడేస్తున్న ఎన్నారై బాలుడు..?