కొత్తగా ట్రై చేస్తున్న కళ్యాణ్ రామ్... చరిత్రలో రాయని కథతో

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం జోరు పెంచాడు.భారీ బడ్జెట్ చిత్రాలతో తన రేంజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

అందులో భాగంగా ఇప్పటికే వేణు మల్లిడి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో బింబిసార మూవీ చేస్తున్నాడు.

మూడు కాలాల నేపధ్యంలో టైం ట్రావెల్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచారు.

మరో వైపు మైత్రీ మూవీ మేకర్స్ లో కొత్త దర్శకుడుగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసింది.

ఇందులో కూడా మూడు విభిన్న పాత్రలలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు.అలాగే ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడు.

ఇప్పుడు మరో కొత్త సినిమా ప్రకటన కూడా వచ్చేసింది.ఇది కూడా భారీ బడ్జెట్ తో మల్టీ లింగ్వల్ మూవీగానే తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక దీనికి సంబందించిన ప్రీ లుక్ ని నిర్మాతలు తాజాగా రిలీజ్ చేసి టైటిల్ రివీల్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

అనే దర్శకుడు, ఇతర క్యాస్టింగ్ వివరాలని కూడా చెప్పనున్నట్లు తెలిపారు.ఇక ప్రీ లుక్ పోస్టర్ లో చరిత్రలో రాయని కథ అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు.

దీనిని బట్టి ఇండియన్ హిస్టరీలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథాంశం చెప్పబోతున్నారని తెలుస్తుంది.

అలాగే పీరియాడిక్ జోనర్ లో ఉండనున్నట్లు పోస్టర్, కళ్యాణ్ రామ్ డ్రెస్సింగ్ స్టైల్, బ్యాగ్రౌండ్ ఎలివేషన్ బట్టి తెలుస్తుంది.

మొత్తానికి మూడు సినిమాలని మూడు భిన్నమైన జోనర్స్ లో సెలక్ట్ చేసుకొని తన మార్కెట్ వేల్యూ పెంచుకోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్ గా రిప్రజెంట్ చేసుకోవడానికి కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

మరి ఈ కొత్త సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు, ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఈ ఎగ్ మాస్క్ తో స్పాట్ లెస్ అండ్‌ వైట్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?