కళ్యాణ్ రామ్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. డెవిల్ బడ్జెట్ మతి పోగొడుతోంది
TeluguStop.com
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో చాలా కాలం తర్వాత భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
కానీ ఆ వెంటనే అమిగోస్ సినిమా( Amigos ) తో నిరాశ పర్చాడు.
అమిగోస్ సినిమా మినిమం వసూళ్లు సాధించలేక పోయిన విషయం తెల్సిందే.ఆకట్టుకునే కథ మరియు విభిన్నమైన కథనంతో వచ్చినా కూడా అమిగోస్ నిరాశ పర్చింది.
ముగ్గురు కళ్యాణ్ రామ్ లు సర్ ప్రైజ్ చేస్తారు అంటూ మేకర్స్ తెగ హడావుడి చేశారు.
కానీ సినిమా ఫలితం ఏంటో అందరికి తెల్సిందే.కళ్యాణ్ రామ్( Kalyan Ram ) గత చిత్రాలు నిరాశ పరిచినా కూడా ఇప్పుడు చేస్తున్న డెవిల్ సినిమాకు చేస్తున్న ఖర్చు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది.
సాధారణంగా పీరియాడిక్ సినిమా అంటేనే చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది.అలాంటిది అయిదు వందల మంది తో యాక్షన్ సన్నివేశాన్ని అది కూడా పీరియాడిక్ సినిమాలో చేయడం అంటే మామూలు విషయం కాదు.
అందుకే నందమూరి కళ్యాణ్ రామ్ కి ఇంత ధైర్యం ఏంటో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
సోషల్ మీడియాలో ప్రస్తుతం డెవిల్ సినిమాకు( Devil ) సంబంధించిన యాక్షన్ సన్నివేశం బడ్జెట్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
ఈ స్థాయిలో ఖర్చు చేయడం.ఇలా ప్రయోగాలు చేయడం కేవలం కళ్యాణ్ రామ్ కే చెల్లింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఆకట్టుకునే విధంగా ఉండే యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయని కూడా మేకర్స్ చెబుతున్నారు.
అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే./br> """/" /
నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ఆ మధ్య ఒక ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ మా కుటుంబంలో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేసింది అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రమే అన్నాడు.
ఇలాగే ప్రయోగాత్మక సినిమాలు చేయాలని కళ్యాణ్ రామ్ విషయంలో ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. నేను మనుషులను ద్వేషిస్తున్నాను అందుకే..