అన్నాదమ్ములంటే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్.. వీళ్లను చూసి చాలా నేర్చుకోవాలంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి( Nandamuri ) కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.నందమూరి హీరోలు ఏ సినిమాలో నటించినా ఆ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్( NTR Kalyan Ram ) కలిసి ఒకే సినిమాలో నటించకపోయినా ఎన్టీఆర్ సినిమాలకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

వీళ్లిద్దరూ రామలక్ష్మణులలా ఉంటారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.

ఈ మధ్య కాలంలో కొంతమంది సెలబ్రిటీల అన్నాదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి.అయితే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ గొడవ పడినట్టు ఒక వార్త కూడా ప్రచారంలోకి రాలేదు.

కళ్యాణ్ రామ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో డేట్స్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఆదుకున్నారు.

తారక్ కళ్యాణ్ రామ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. """/" / తారక్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలకు కళ్యాణ్ రామ్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండగా తర్వాత రెండు సినిమాలు తారక్ కోరుకున్న విజయాలను అందించి కళ్యాణ్ రామ్ కు కూడా మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

"""/" / ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకుంటున్న తీరు గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.

కెఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉంటూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగడం ద్వారా ప్రశంసలను సొంతం చేసుకుంటున్నారు.

కళ్యాణ్ రామ్ సినిమాల ఈవెంట్లకు ఎన్టీఆర్ హాజరవుతూ సినిమాలపై అంచనాలను పెంచుతున్నారు.కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ త్వరలో కలిసి నటించి ప్రేక్షకులకు మరిన్ని శుభవార్తలు చెబుతారేమో చూడాలి.

ఈ ఇద్దరు హీరోల మార్కెట్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

టీ, కాఫీల‌కు బ‌దులు నిత్యం ఉదయం ఈ జ్యూస్ తాగారంటే రోగాలన్నీ పరార్ అవ్వాల్సిందే!