కళ్యాణ్ రామ్ సినిమా కెరియర్ చూసుకుంటే హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉంటాయి.
సొంత బ్యానర్ లో కూడా ఫ్లాప్ సినిమాలే ఎక్కువ అతన్ని పలకరించాయి.అయితే ఎప్పుడూ కూడా సొంత బ్యానర్ మీద సినిమాలు చేస్తూ ప్రయోగాలకి పెద్దపీట వేయడం కళ్యాణ్ రామ్ స్టైల్.
కమర్షియల్ జోనర్ లోనే సినిమాలు చేసిన అందులో ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటాడు.
ఈ కారణంగా అతని కెరియర్ లో ఎక్కువగా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయనేది చాలా మంది మాట.
ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ చివరిగా ఎంత మంచివాడవురా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.నెక్స్ట్ సినిమా కోసం కొంత గ్యాప్ తీసుకొని ఈ సారి ఫిక్షన్ కథాంశంతో భారీ బడ్జెట్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో వేణు మల్లిడి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.కథ భాగా నచ్చడంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమాని తన కెరియర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యింది.త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కంటెంట్ పరంగా బాలకృష్ణ ఆదిత్యా 369 సినిమాకి భాగా దగ్గర పోలికలు ఉంటాయని తెలుస్తుంది.
అయితే అదే కథని ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్లు కాస్తా మార్పులు చేర్పులు చేసి మళ్ళీ తెరకెక్కిస్తున్నారనే టాక్ కూడా నడుస్తుంది.
ఈ సినిమాలో కథ నేపధ్యం కూడా గతం, వర్తమానం, భవిష్యత్తు చుట్టూ తిరిగుతుందని సమాచారం.
500 ఏళ్ల క్రితం ఉన్న ఓ సమస్యని ఫాస్ట్ లోకి టైం మిషన్ సహాయంతో వెళ్లి హీరో ఎలా పరిష్కరించాడు అనే ఎలిమెంట్ ప్రధానంగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
టైమ్ మిషన్ ఎలిమెంట్ అంతా కూడా బాలకృష్ణ సినిమానే పోలి ఉంటుంది బోగట్టా.