Kalyan Ram : కళ్యాణ్ రామ్ స్టార్ హీరో కావడానికి ఎన్టీఆర్ చేసిన త్యాగమే కారణమా.. ఆ సినిమాను కావాలనే వదులుకున్నాడా?

తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్,( Jr Ntr )కళ్యాణ్ రామ్ గురించి మనందరికీ తెలిసిందే.

నందమూరి వారసులుగా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు హీరోలు ఎవరికి వారు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.ఇక ఎన్టీఆర్ కళ్యాణ మధ్య సఖ్యత అనురాగం గురించి మనందరికీ తెలిసిందే.

ఇద్దరు ఎక్కడ కనిపించినా కూడా చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. """/" / కాగా కళ్యాణ్ రామ్( Kalyan Ram )సినిమాలలో నటించకపోయినప్పటికీ తన బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గాని గడుపుతున్నారు.

అయితే అలా తన బ్యానర్లో సినిమాలు చేస్తూ అవి ఫ్లాపులు అవ్వడంతో కళ్యాణ్ రామ్ పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బ్యానర్ లో సినిమాలు చేయడంతో పాటు రెమ్యూనరేషన్ తీసుకోకుండా జై లవకుశ సినిమా( Jai Lava Kusa ) చేసి కళ్యాణ్ రామ్‌ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించారు.

అలా ఆ సమయంలో కళ్యాణ్ రామ్ ని కష్టాల నుంచి గట్టెక్కించారు జూనియర్ ఎన్టీఆర్.

కాగా కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. """/" / ఈ సినిమాకు అనిల్ రావిపూడి ( Anil Ravipudi 0దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను స్వయంగా నిర్మించారు కళ్యాణ్ రామ్.

మొదట ఈ కథ కళ్యాణ్ రామ్‌కు వినిపించగా చాలా బాగా నచ్చింది.అయితే తన బ్యానర్ లో స్టార్ హీరో తో ఈ సినిమా చేస్తే బాగుంటుందని కళ్యాణ్ రామ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అనిల్ కూడా ఎన్టీఆర్ కు కథ చెప్పగా ఎన్టీఆర్ కు బాగా నచ్చింది.

కళ్యాణ్ రామ్‌కు మాత్రం ఎన్టీఆర్ తో చేస్తే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న ఆశ ఉంది.

అయితే ఎన్టీఆర్ మాత్రం కళ్యాణ్ రామ్ వరుస ప్లాపుల్లో ఉన్నందున కళ్యాణ్ చేస్తేనే బాగుంటుందని అనిల్ రావిపూడికి చెప్పగా అదే టైంలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్గా టెంపర్ సినిమా చేస్తున్నారు.

వెంట‌నే మ‌రో పోలీస్ ఆఫీస‌ర్ సినిమా చేస్తే బాగోద‌ని చెప్ప‌డంతో పాటు క‌ళ్యాణ్‌ రామ్ ఈ సినిమా చేస్తే స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతాడ‌ని అనిల్‌కు చెప్పాడ‌ట‌.

ఎన్టీఆర్ చెప్పిన విధంగా అనిల్ పటాస్ సినిమా( Patas Movie )ను కళ్యాణ్ రామ్ తో చేయడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం జరిగింది.

రాజమౌళి డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ హీరోగా సినిమా.. ఆ రీజన్ వల్లే ఆగిపోయిందట!