కళ్యాణ్ దేవ్ కి మెగా ఫ్యామిలీలో అవమానం జరిగిందా… ఆ పోస్టుకు అర్థం అదేనా?

కళ్యాణ్ దేవ్ హీరోగా ఈయన వార్తల్లో నిలవడం కన్నా తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

ఈయన మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను రెండవ వివాహం చేసుకున్నారు.ఇలా వీరి వివాహం జరిగిన తర్వాత హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన కళ్యాణ్ దేవ్ రెండు మూడు సినిమాలలో నటించారు.

అయితే ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాలకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేదు అదే విధంగా కళ్యాణ్ దేవ్ శ్రీజ విడాకులు తీసుకొని తనకు దూరంగా ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కానీ ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ ఈ వార్తలపై స్పందించలేదు. """/" / ఇక సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ దేవ్ చేసే పోస్టులు కనుక చూస్తుంటే శ్రీజ కళ్యాణ్ ఇద్దరు దూరంగా ఉన్నారని ఈయన కుమార్తె శ్రీజ వద్దే ఉందని తెలుస్తోంది.

కళ్యాణ్ దేవ్ తన కుమార్తె నాలుగవ పుట్టినరోజు సందర్భంగా కూడా తనని చాలా మిస్ అవుతున్నాను అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.

ఇకపోతే తాజాగా ఈయన మరొక పోస్ట్ చేయడంతో మెగా ఫ్యామిలీలో ఈయనకి అవమానం జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

"""/" / ఈ క్రమంలోనే కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక కొటేషన్ షేర్ చేస్తూ.

ఎదుటివారు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారు అనేది ముఖ్యం కాదు వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం అంటూ కళ్యాణ్ దేవ్ ఒక కొటేషన్ షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో మెగా ఫ్యామిలీలో ఈయనకు సరైన గౌరవం ఇవ్వలేదా?మెగా ఫ్యామిలీలో తనకు అవమానం జరిగిందా అందుకే మెగా ఫ్యామిలీకి శ్రీజకు ఈయన దూరంగా ఉంటున్నారా అంటూ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక వీరి విడాకులకు కూడా ఇదే కారణమా అంటూ మరికొందరు సరికొత్త సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

ఏది ఏమైనా కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఈ కొటేషన్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న ప్రశాంత్ వర్మ…