కూతురు కోసం కలవనున్న కళ్యాణ్ దేవ్ శ్రీజ..?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) చిన్న కూతురు అయినా శ్రీజ ( Sreeja )విషయంలో చిరంజీవి కొంతవరకు బాధపడుతున్నారనే చెప్పాలి.

ఎందుకంటే తన కొడుకు అయినా రామ్ చరణ్( Ram Charan ) ఎంత క్రమ శిక్షణ తో ఉంటాడో మనందరికీ తెలిసిందే రామ్ చరణ్ కి వచ్చిన చిరంజీవి క్రమశిక్షణ ఆయన చిన్న కుమార్తె అయినా శ్రీజకి రాలేదని చాలా మంది మేధావులు వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే శ్రీజ కెరియర్ రోజుకొక మలుపు తిరుగుతుంది మొదట్లో శ్రీజ చిరంజీవి తో సహా తన ఇంట్లో వాళ్ళని కాదని తాను ప్రేమించిన వాడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.

"""/" / కొద్దీ రోజులు బాగానే ఉన్న ఒక పాపా పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు అప్పటి నుంచి తాను చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది కొద్దీ రోజుల తర్వాత 2016 లో చిరంజీవి శ్రీజ ని కళ్యాణ్ దేవ్( Kalyan Dev ) కి ఇచ్చి రెండో పెళ్లి చేసాడు.

వీళ్ళకి నవిష్క( Navishka ) అనే కూతురు కూడా ఉంది అయితే ఇప్పుడు అందరి అంచనాలు తారు మరు చేస్తూ శ్రీజ కి కళ్యాణ్ దేవ్ కి గొడవలు రావడం తో శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించకపోవడం అలాగే కళ్యాణ్ దేవ్ సినిమాలకు మెగా కుటుంబం సపోర్టు లేకపోవడం, మెగా కుటుంబానికి కళ్యాణ్ దేవ్ దూరం కావడం చూస్తుంటే ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు.

"""/" / ఇక వీరిద్దరూ విడివిడిగా ఉంటునప్పటికీ విడాకుల గురించి అధికారకంగా మాత్రం తెలియజేయలేదు.

ఇక నవిష్క సైతం ప్రస్తుతం శ్రీజ వద్దే ఉన్నారు.కానీ తన కుమార్తె విషయంలో వీరిద్దరూ కాంప్రమైజ్ అయ్యారని తన కుమార్తె శ్రీజ వద్ద మాత్రమే కాకుండా కళ్యాణ్ దేవ్ వద్ద కూడా ఉంటుంది.

గత కొద్ది రోజుల క్రితం కళ్యాణ్ దేవ్ తన కుమార్తెతో కలిసి ఉన్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

కూతురు కోసమైన వీళ్ళిద్దరు కలుస్తారేమో చూడాలి మరి.

ధనుష్ ఒక్కడికే ఎందుకు ఇలా జరుగుతుంది…