మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో నటులు టాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్న విషయం విదితమే.
మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.
ఇప్పటికే విజేత సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది పెద్దగా ఆదరణ పొందకపోవడం తో ఇప్పుడు మరో చిత్రం తో ప్రేక్షకులను మెప్పించే పనిలో పడ్డారు.
తొలిసినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని మరి 'సూపర్ మచ్చి' అనే సినిమా లో కళ్యాణ్ దేవ్ నటిస్తున్నాడు.
అయితే ఈ ఏడాది వేసవి కాలంలో ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ చిత్రం కరోనా కారణంగా ఎదురు దెబ్బ తలిగింది.
అతడి కొత్త సినిమా సూపర్‌మచ్చి షూటింగ్ పూర్తి చేసుకొని, ఆ తరువాతి కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవడం తో ఇప్పుడు ప్రస్తుతం థియేటర్ల ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తుంది చిత్ర యూనిట్.
ఇప్పుడు దాదాపు అన్ని చిత్రాలు కూడా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ కళ్యాణ్ దేవ్ మాత్రం థియేటర్స్ లోనే తన టాలెంట్ ను పరీక్షించుకోనున్నారు.
అందుకే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ను కూడా కాదని థియేటర్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది వేసవి కాలంలో విడుదల చేయాలనుకున్న చిత్ర బృందానికీ కరోనా కారణంగా ఎదురు దెబ్బ పడడం తో లాక్‌డౌన్ మొదట్లో మూడు వారల షూటింగ్‌తో సినిమా పూర్తిఅయినప్పటికీ ప్రస్తుతం థియేటర్ల రీఓపెన్ కోసం చిత్ర యూనిట్ ఎదురు చూస్తుంది.
కేంద్రం థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు.
ఓటీటీ ఆఫర్లు వస్తున్నా చిత్ర యూనిట్ వాటిని తిరస్కరిస్తూ మరి థియేటర్ల కోసం ఎదురుచూస్తుంది.
మరి అంతగా థియేటర్స్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ దేవ్ కు ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.