ఒంటరిగానే కళ్యాణ్ దేవ్ ఎంజాయ్.. హోళీ పిక్స్ వైరల్
TeluguStop.com
ఈరోజు హోలీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు రంగులను పూసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
అంతేకాకుండా తాము రంగులతో నిండి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక సెలబ్రెటీలు మాత్రం బాగా సందడి చేస్తున్నారు.తెల్లని దుస్తులను ధరించి అనేక రంగులను ఒంటిపై పోసుకుని బాగా చిల్ అవుతున్నారు.
ఇక తాము దిగిన ఫోటోలను నెట్టింట్లో బాగా షేర్ చేస్తున్నారు.మొత్తానికి సామాన్యులే కాకుండా సెలబ్రెటీలు కూడా రంగుల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా హీరో కళ్యాణ్ దేవ్ కూడా హోలీ పండుగ జరుపుకొని వాటికి సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకోగా.
ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, టాలీవుడ్ హీరో కళ్యాణ్ దేవ్ పరిచయం అందరికీ తెలిసిందే.
ఈయన మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజను పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అలా ఇతడికి మెగా హీరో గా ఒక గుర్తింపు ఉంది.ఈయన తొలిసారిగా విజేత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ఈ సినిమాతో కొంత సక్సెస్ అందుకున్నాడు కళ్యాణ్ దేవ్.చిరంజీవి సపోర్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కళ్యాణ్ దేవ్ తనకంటూ సొంతంగా ఓ సక్సెస్ కోసం పోరాడుతున్నాడు.
అలా ఇటీవలే విడుదలైన సూపర్ మచ్చి సినిమాలో అవకాశం అందుకున్నాడు.కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది.
ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కళ్యాణ్ దేవ్ ఆశలు నిరాశ అయ్యాయి.
"""/" /
కనీసం అనుకున్నంత బడ్జెట్ కూడా రాకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
అదే సమయంలో కళ్యాణ్ గురించి మరో వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
కళ్యాణ్ ను మెగా ఫ్యామిలీ దూరం పెట్టినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి.
అంతేకాదండోయ్ తన భార్య శ్రీజ కూడా తనను వదిలేస్తున్నట్లు బాగా గుసగుసలు వినిపించాయి.
గత కొన్ని రోజుల నుండి శ్రీజ తన భర్తను దూరం పెడుతుందని. """/" /
పైగా తన పేరు నుంచి కళ్యాణ్ అనే పేరు శ్రీజ తొలగించినట్లు కూడా తెలిసింది.
దీంతో వీరిద్దరి బంధం తెగిపోవడం ఖాయమని అన్నారు.ఇక ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు.
తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా ఖాతాలో కొన్ని ఫోటోలు పంచుకున్నాడు.
"""/" /
ఆ ఫోటోలో తాను హోలీ సెలబ్రేషన్స్ తో బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపించాడు.
ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
భార్య లేకుండా ఒంటరిగానే కళ్యాణ్ హోలీ ఎంజాయ్ చేస్తున్నాడు అని కామెంట్లు పెడుతున్నారు.
మరికొందరు ఆయనకు పెళ్లి కళ వచ్చేసింది అంటూ.రెండో పెళ్లి గురించి సలహాలు ఇస్తున్నారు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ.. వైరల్ వార్త నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగే!