Kalyan Dev : నీ రాకతో ఎంతో ప్రత్యేకం.. కూతురుపై కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్టు?

కళ్యాణ్ దేవ్( Kalyan Dev ) పరిచయం అవసరం లేని పేరు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడుగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన సినిమాలలో కూడా నటించారు.

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ( Sreeja) ను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించారు.

అయితే ఇటీవల కాలంలో ఈయన మెగా డాటర్ తో విడాకులు తీసుకొని దూరంగా ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.

వీరి విడాకుల వార్తలను అధికారకంగా ప్రకటించకపోయిన వీరిద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. """/" / ఇక భర్త నుంచి దూరంగా ఉన్నటువంటి శ్రీజ తన పిల్లలను తన వద్ద ఉంచుకున్నారు కానీ కళ్యాణ్ దేవ్ కుమార్తె నవిష్క( Navishka ) మాత్రం అప్పుడప్పుడు తన తండ్రి వద్దకు వెళుతూ ఉంటారు ఇలా తన కూతురు తన వద్దకు వచ్చిన సమయంలో తనతో కలిసి ఎంతో సరదాగా సంతోషంగా గడిపినటువంటి కళ్యాణ్ ఆ అద్భుతమైన క్షణాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన కూతురి పట్ల ఎమోషనల్ పోస్టులు చేస్తుంటారు.

"""/" / ఇలా తన భార్యకు దూరంగా ఉన్నప్పటికీ తన కూతురి ప్రేమ కోసం ఎంతో పరితపిస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా కళ్యాణ్ దేవ్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.తన పుట్టినరోజు ( Birthday ) సందర్భంగా తన కుమార్తె నవిష్క తన ఇంటికి వెళ్లడంతో ఈయన ఆనందం మరింత రెట్టింపు అయింది.

ఇలా తన కూతురు సమక్షంలో కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇలా నువ్వు రావడంతో నా బర్త్ డే ప్రత్యేకంగా మారింది.నీతో ఇలా మెమోరీస్‌ను క్రియేట్ చేసుకోవడం నాకు ఆనందంగా ఉంటుందని ఈయన షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

 .

ఇదేందయ్యా ఇది.. చేతిలో గొడుగు పట్టుకొని రైలు నడుపుతున్న లోకో పైలట్..