Kalvakuntla Kavitha: చిరంజీవి తర్వాతనే అల్లు అర్జున్.. కల్వకుంట్ల కవిత కామెంట్స్ వైరల్?

తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha ) నిత్యం రాజకీయాలతో బిజీగా ఉంటారు.

తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటారు కవిత.పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంటూనే ప్రజాసేవలో మునిగితేలుతున్నా ఆమెకు కూడా కాస్త ఎంటర్‌టైన్మెంట్ అవసరమే కదా.

ఆమెకు వినోదాన్ని పంచేవి సినిమాలు.చిన్ననాటి నుంచే కవిత సినిమా ప్రేమికురాలు.

ఈ విషయాన్ని గతంలో ఆమె చాలా సార్లు తెలిపారు.అంతేకాదు, తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) అని కూడా తెలిపారు.

"""/" / నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.అయితే, నెటిజనులు అడిగిన ప్రశ్నల్లో రాజకీయాలతో పాటు సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ చిరంజీవి అభిమానిగా ఆయన గురించి ఏమైనా చెప్పండి అని అడగగా.

దీనికి ఆమె.డై హార్డ్ ఫ్యాన్ అని సమాధానం ఇచ్చారు.

మరో నెటిజన్ కూడా మీ ఫేవరేట్ హీరో ఎవరు మేడమ్ అని అడిగగా.

చిరంజీవి ఆల్వేజ్ నెక్ట్స్ అల్లు అర్జున్.( Allu Arjun ) తగ్గేదేలే అంటూ రిప్లై ఇచ్చింది.

మొదట చిరంజీవికి అభిమానిని ఆ తర్వాత అల్లు అర్జున్ అని తెలిపింది కవిత.

"""/" / వీటితో పాటుగా ఇంకా ఎన్నో ప్రశ్నలను నెటిజెన్స్ ప్రశ్నించగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది కవిత.

కాగా చిరంజీవి అల్లు అర్జున్ విషయంలో చెప్పిన సమాధానం చూసి అల్లు ఫ్యాన్స్,మెగా ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.

అల్లు అర్జున్ అభిమానులు అయితే చిరంజీవి, బన్నీ ఫొటోలను పక్కపక్కన పెట్టి కామెంట్లలో పోస్ట్ చేస్తున్నారు.

గతంలోనూ చిరంజీవి గురించి ఓ టీవీ ఛానెల్‌లో కవిత మాట్లాడారు.మీ ఫేవరేట్ ఎవరు? అని జర్నలిస్ట్ ప్రేమ అడిగినప్పుడు.

చిరంజీవి ఆల్వేజ్ అని సమాధానం ఇచ్చారు.

ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేస్తానని రామ్ చరణ్ చెప్పారా.. ఏం జరిగిందంటే?