రాజ్యసభకు కేసీఆర్ సీఎంగా కేటీఆర్ ?

టీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల లాజిక్, ఆయన రాజకీయ నిర్ణయాల్లో చూపించే తెలివితేటలు ఒక పట్టాన ఎవరికి అర్థం కావు.

రాజకీయ చాణిక్యుడిగా తెలంగాణ లో టిఆర్ఎస్ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

తన నిర్ణయాలకు ఎక్కడా అడ్డుపడకుండా రాజకీయ ప్రత్యర్థులను ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకోగలిగారు.

తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా విజయం మాత్రం టిఆర్ఎస్ పార్టీదే అన్నట్లుగా కేసీఆర్ వ్యూహాలు పన్నుతూ సక్సెస్ అవుతున్నారు.

తాజాగా ఇదే తరహాలో కెసిఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

దీనిలో భాగంగా తన క్యాబినెట్లో కీలక మంత్రి గానే కాకుండా, పార్టీలో తన తర్వాతి స్థానంలో బాధ్యతలు చూడాల్సిన కేటీఆర్ ను సీఎంగా చేయాలని కెసిఆర్ అంతిమంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ మాట చాలా కాలం నుంచి వినిపిస్తున్నా సరైన సమయం, సందర్భం రాకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు కేసీఆర్.

కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ను యాక్టివ్ చేసి అక్కడ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని కేసీఆర్ ఆలోచన.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/02/KCR-TRS-Rajya-Sabha-CM-KTR-కేటీఆర్-కేసీఆర్!--jpg"/అలాగే తెలంగాణలో బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించి తాను పక్కకు తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగానే త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం తాను తీసుకుని, తెలంగాణలో సీఎంగా కేసీఆర్ ను చేయాలని చూస్తున్నారట.

తాను రాజ్యసభకు వెళ్లడం ద్వారా జాతీయ స్థాయిలో పరిచయాలు పెంచుకోవడమే కాకుండా, బిజెపి వ్యతిరేక పార్టీ లను ఒక తాటి మీదకు తీసుకువచ్చి, భవిష్యత్తులో ఎదురులేని పార్టీగా టీఆర్ఎస్ ను చేయాలని కెసిఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇదే టాపిక్ టిఆర్ఎస్ నాయకుల్లో తీవ్ర చర్చగా మారింది.ఈ విషయంపైనే అంతా మాట్లాడుకుంటున్నారు.

ఎలాగూ కేటీఆర్ ను సీఎంగా చేయడం తప్పదు కాబట్టి తాను ఇక్కడే కేటీఆర్ కు సలహాదారుడిగా ఉండే కంటే జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం ద్వారా మరింతగా టిఆర్ఎస్ కు పేరుప్రఖ్యాతలు తీసుకురావచ్చు అన్నదే కెసిఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.సీఎంగా బాధ్యతలు తీసుకోవడానికి కేటీఆర్ కూడా ఎప్పటినుంచో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం కేటీఆర్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని, కొంతకాలం తర్వాత సీఎం గా ప్రమోషన్ ఇస్తారని వార్తలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం మాత్రం డైరెక్ట్ గా సీఎం పదవిని అప్పజెప్పి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఉత్సాహంతో కేసీఆర్ ఉన్నట్టుగా టిఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ.

భార్య మంగళ సూత్రం అమ్మి పేకాట.. ఆ వ్యక్తికి పవన్ కళ్యాణ్ చుక్కలు చూపించారా?