వాళ్లపై రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేసిన కల్కి మేకర్స్.. నోటీస్ తో నోర్లు మూయించారుగా!

మామూలుగా ఒక సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించింది అంటే సంతోషపడే వారి కంటే కుళ్లుకుంటూ నెగటివ్గా కామెంట్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

ఇప్పటికే చాలా సందర్భాలలో ఇలా సూపర్ హిట్ సాధించిన సినిమాలకు నెగటివ్గా కామెంట్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

సౌత్ సినిమాల సక్సెస్ ని కొంతమంది నార్త్ ఇండియన్ క్రిటిక్స్ అస్సలు సహించలేరు.

సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని అద్భుత ప్రేక్షకాదరణ అందుకునే సినిమాలపై కూడా ఇష్టానుసారంగా నెగిటివ్ రివ్యూలు రాసేస్తూ ఉంటారు.

అలాగే నిర్మాతలు అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే కలెక్షన్స్ ని కూడా ఫేక్ అంటూ నెగిటివిటీని ప్రజాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు.

"""/" / ముఖ్యంగా వారి లక్ష్యం బాలీవుడ్( Bollywood ) సినిమాలపై సౌత్ సినిమాల ఆధిపత్యం లేకుండా చేయడమే అని ఒక వర్గం ప్రేక్షకుల అభిప్రాయం.

బాలీవుడ్ లో డిజాస్టర్ సినిమాలని కూడా అక్కడి సెల్ఫ్ మేడ్ క్రిటిక్స్ అద్భుతం అంటూ ఊదరగొడతారని, సౌత్ సినిమాలు ఎంత అంద్భుతంగా ఉన్న బాగోలేదని ప్రచారం చేస్తారని కూడా మరికొందరు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే కల్కి మూవీ( Kalki Movie ) వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.అలాగే ఏరియా వారీగా కలెక్షన్స్ ని కూడా ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.

"""/" / అయితే ఈ కలెక్షన్స్ పై ఫేక్ ప్రచారం చేస్తోన్న బాలీవుడ్ క్రిటిక్స్ పై వైజయంతీ మూవీస్ పరువు నష్టం దావా వేసింది.

తమ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా తప్పుడు వార్తలని సదరు క్రిటిక్స్ జనాల్లోకి పంపిస్తున్నారని లీగల్ గా 25 కోట్లకి డిఫార్మేషన్ వేశారు.

దాంతో ఇప్పుడు ఇది బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రిటిక్స్ కారణంగా చాలా మంది నిర్మాతలు, హీరోలు ఇబ్బంది పడ్డారు.

అయితే ఎవరు కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు.మొదటిసారి ఆ క్రిటిక్స్ కి వైజయంతీ మూవీస్ నుంచి స్ట్రాంగ్ ఆన్సర్ వెళ్ళింది.

పదే పదే నిరాధారంగా తప్పుడు వార్తలని సినిమాపై, కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండటంతోనే ఈ డిఫార్మేషన్ కేసుని ఫైల్ చేశారు.

సన్నాఫ్ ఇండియా డైరెక్టర్ ఏమైపోయాడు.. పవన్‌తో సినిమా చేసేనా?