కల్కి మూవీ సీక్వెల్ టైటిల్ ఇదేనా.. సినిమా స్క్రిప్ట్ అలా ఉండబోతుందా?
TeluguStop.com
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో కల్కి సినిమా( Kalki Movie ) ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
కల్కి 2898 ఏడీ మూవీ( Kalki 2898 AD Movie ) ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది.
అయితే కల్కి సీక్వెల్ కు మాత్రం కర్ణ 3102 బిసి ( Karna 3102 BC )అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.
భవిష్యత్తు నుంచి గతంలోకి వెళ్లేలా ఈ సినిమా కథాంశం ఉండనుందని భోగట్టా.2028 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానుంది.
నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
కల్కి1 సినిమాను మించి ఈ సినిమా ఉండే విధంగా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.
ఈ సినిమా బడ్జెట్ కూడా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువని సమాచారం అందుతోంది.
నాగ్ అశ్విన్ ఈ సినిమాతో టాలీవుడ్ స్థాయిని ఎన్నో రెట్లు పెంచుతారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
"""/" /
నాగ్ అశ్విన్ కల్కి సినిమాకు పరిమితంగానే పారితోషికం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
కల్కి సీక్వెల్ టైటిల్ కు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల విషయంలో మేకర్స్ రియాక్షన్ ఎలా ఉండనుందో చూడాల్సి ఉంది.
కల్కి సీక్వెల్ లో ట్విస్టులు సైతం ఊహించని స్థాయిలో ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
"""/" /
ప్రభాస్( Prabhas ) కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో కల్కి ఒకటిగా నిలిచిన నేపథ్యంలో కల్కి సీక్వెల్ ఏ విధంగా ఉండబోతుందనే చర్చ సైతం జరుగుతోంది.
కల్కి సీక్వెల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కల్కి సీక్వెల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్పెషల్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కల్కి2 సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను అందించే అవకాశాలు అయితే ఉన్నాయి.
రాత్రికి రాత్రే మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త నియమాలు!