కాళేశ్వరం..కే‌సి‌ఆర్ కు ముప్పేనా ?

తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్( Congress ) మరియు బీజేపీ పార్టీల మెయిన్ టార్గెట్ బి‌ఆర్‌ఎస్ ( Brs )అనే సంగతి అందరికీ తెలిసిందే.

గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ ను గద్దె దించి తాము అధికారంలోకి రావాలని చూస్తున్నారు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల నేతలు.

ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ పాలనపై తీవ్రమైన విమర్శలు ఆరోపణలు చేస్తూ పోలిటికల్ హిట్ పెంచుతున్నారు.

ముఖ్యంగా ధరణి పోర్టల్ ద్వారా కే‌సి‌ఆర్ ( KCR )భారీగా కుంభకోణానికి పాల్పడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని, కుటుంబ పాలన సాగుతోందని.

ఈ రకమైన విమర్శలు కే‌సి‌ఆర్ వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. """/" / ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ( Kaleshwaram Project )పదే పదే చర్చల్లో ఉండేలా బీజేపీ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

అయితే ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా కాలేశ్వరాన్ని కే‌సి‌ఆర్ అండ్ కొ గొప్పగా చెబుతుంటే ప్రత్యర్థి పార్టీ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తుండడంతో ఎన్నికల ముందు ఈ ప్రాజెక్ట్ అంశం హాట్ టాపిక్ గా మారింది.

ఈ ప్రాజెక్ట్ ను 2016 లో మొదలు పెట్టి 2019 జూన్ 21 న అధికారికంగా పూర్తి చేశారు.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అయిన ఖర్చు రూ.80,190 కోట్లు.

అయితే ఇందులో భారీ మొత్తంగా కుంభకోణం జరిగిందని, వెయ్యి నుంచి ఐదు వేల కోట్ల వరకు కే‌సి‌ఆర్ కుటుంభం అవినీతికి పాల్పడిందని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ మరియు బీజేపీ నేతలు.

"""/" / తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామని ఇరు పార్టీల అధినేతలు నొక్కి చెబుతున్నారు.

ఇక తాజాగా బీజేపీ( BJP ) ఏకంగా మేనిఫెస్టోలోనే కాళేశ్వరం పై సమగ్ర విచారణకు కమిటీ వేస్తామని ప్రకటించడంతో కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఆ స్థాయిలో అవినీతి జరిగిందా అనే చర్చ అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ వాదుల్లోనూ రోజురోజుకూ పోఎరుగుతోంది.

ఈ అంశం ఎన్నికల ముందు బి‌ఆర్‌ఎస్ ను ఇరుకున పెట్టె అవకాశం ఉందనేది కొమ్దౌర్ విశ్లేషకులు చెబుతున్నా మాట.

మరి కాళేశ్వరం విషయంలో కే‌సి‌ఆర్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

బాలయ్య గోల్డెన్ జూబ్లీ… ఆ నందమూరి హీరోలకు నో ఇన్విటేషన్?