కాళేశ్వరం ప్రాజెక్ట్ బాకీలు మొత్తం తీరిపోయాయి సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( Telangana CM KCR ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాలేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అప్పులు మొత్తం తీరిపోయాయని స్పష్టం చేశారు.ఇక ఇదే సమయంలో వ్యవసాయంలో ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మళ్లీ వెనక్కి వస్తుంది అని పేర్కొన్నారు.

80 వేల కోట్ల రూపాయలతో కట్టిన కాలేశ్వరం( Kaleswaram ) అప్పు ఎప్పుడో తీరిపోయింది.

ఒక్కోసారి మూడు కోట్ల టన్నులు వరి పండుతోంది.ఇలాంటివి చూస్తుంటే గుండె ఉప్పొంగుతుంది.

అంతేకాదు పండించిన ధాన్యం వడ్లు స్టోర్ చేయడానికి.గిడ్డంగులు సరిపోవు నీ పరిస్థితి కావడంతో కొత్తవి కట్టాల్సి వస్తుంది.

ఇదే సమయంలో ధరణి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.ధరణి తీసేయాలని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.

ధరణి తీసేస్తే రైతుబంధు( Raithu Bandhu ) ఎలా వస్తుందని ప్రశ్నించారు.ధరణితో భూములను డిజిటలైజేషన్ చేసాం.

ధరణి ద్వారా యజమానులు మాత్రమే ఇతరులకు భూమి మార్చగలరు.ధరణి వల్లే భూముల ధరలు పెరిగాయి.

ధరణి ద్వారా నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అన్నివేళలా విద్యుత్తు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

విద్యుత్ విషయంలో ఏపీలో కంటే తెలంగాణలో పరిస్థితి చాలా అద్భుతంగా ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

భర్తతో విడాకుల తర్వాత సంతోషంగానే ఉన్నా.. అమీర్ ఖాన్ భార్య కామెంట్స్ వైరల్!