బాలయ్య వల్ల ఈ నటుడికి 14 సినిమాలలో ఆఫర్లు వచ్చాయట.. గ్రేట్ అంటూ?
TeluguStop.com
ప్రభాకర్ అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ బాహుబలి లేదా కాలకేయ ప్రభాకర్ అంటే మాత్రం ఇచ్చే గుర్తుపట్టిస్తూ ఉంటారు.
అయితే ఈ సినిమాల కంటే ముందు పలు సినిమాలలో నటించినప్పటికీ రాణి గుర్తింపు ఒక బాహుబలి సినిమా తోనే సాధ్యమైంది అని చెప్పవచ్చు.
బాహుబలి సినిమా తర్వాత కాలకేయ ప్రభాకర్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.అంతేకాకుండా కాలకేయ ప్రభాకర్ దాదాపుగా ఐదు భాషల్లో 120 కు పైగా సినిమాలు నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం తోపాటు ప్రేక్షకులను కూడా మెప్పించాడు.
అయితే పోలీస్ అవుదామని హైదరాబాద్ కు వచ్చిన కాలకేయ ప్రభాకర్ అనుకోకుండా నటుడిగా మారాడట.
అలా ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కాలకేయ ప్రభాకర్.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాకర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
దర్శకుడు బోయపాటి గురించి చెప్పండి? అని అడగగా బోయపాటి శ్రీను కమిట్‌మెంట్ ఉన్న దర్శకుడు.
నటుడిలో ఉన్న ప్రతిభను గుర్తించి తన స్టైల్‌లో సన్నివేశాన్ని పండించగల సమర్థుడు.నటులకు ఇబ్బంది లేకుండా చూసుకునే మనస్తత్వం ఆయనిది అని తెలిపాడు ప్రభాకర్.
ఇక మీరు ఈ మధ్య ఎక్కువగా పోలీస్ పాత్రల్లోనే కనిపిస్తున్నారు? కదా అని అడగగా అఖండలో నేను చేసిన పోలీస్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
వాస్తవానికి పోలీస్ అవ్వాలనే కోరిక రియల్ లైఫ్‌లో తీరకపోయినా కూడా రీల్ లైఫ్‌లో కుదిరింది.
అఖండ తర్వాత వరసగా 14 సినిమాల్లో పోలీస్ పాత్రలే వచ్చాయి అని సంతోషంగా తెలిపారు ప్రభాకర్.
"""/"/
కాగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత మీకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా? ఏది అని ప్రశ్నించగా ఆ విషయం పై స్పందించిన ప్రభాకర్ నేను పూర్తిస్థాయిలో నటుడిగా మర్యాదరామన్న సినిమాలో నటించాను.
నేను ఆ సినిమాలో చెప్పిన డైలాగ్ లతో మంచి గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత బాహుబలి, జై సింహా, అఖండ వంటి సూపర్ హిట్ సినిమాలు నా సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయాయి అని చెప్పుకొచ్చారు కాలకేయ ప్రభాకర్.
ఎవరికైనా మీరు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు నలుగురు ప్రధాన కారణం.
వారు రాజమౌళి, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, వంశీ లు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు.
వీరికి జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చారు కాలకేయ ప్రభాకర్.
తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్…