Kurchi Thatha: నన్ను కుర్చీ తాత అంటారండి అంటూ భిక్షాటన చేస్తున్న కుర్చీ తాత..షాక్ లో నెటిజన్స్!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా సెలబ్రిటీలుగా మారినటువంటి వారిలో కుర్చీ తాత( Kurchi Thatha ) ఒకరు.

ఈయన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి ఇతని పేరు షాషా.( Pasha ) తెలంగాణలో ఎన్నికల సమయంలో ఈయన మీడియా దగ్గర మాట్లాడుతూ కుర్చీ మడత పెట్టి అంటూ ఒక బూతు డైలాగ్ చెప్పారు.

ఇలా ఈ డైలాగ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ తాత ప్రస్తుతం సినిమాలలో పాటలు పాడే అవకాశాలను కూడా అందుకున్నారు.

కుర్చీ మడత పెట్టు అనే డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటిస్తున్నటువంటి గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో ఏకంగా ఇదే పాటను పాడే అవకాశాన్ని కల్పించారు.

ఇటీవల ఈ సినిమాలోని ఈ సాంగ్ ప్రోమో విడుదల చేయగా ఒక్కసారిగా కుర్చీ తాత కూడా ట్రెండ్ అయ్యారు.

ఈ ప్రోమో విడుదల కావడంతో ఈయన రెండు రోజులపాటు కనిపించకపోయిన అనంతరం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

"""/" / ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నటువంటి కుర్చీ తాత ఈ సినిమాలో పాట రావడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఇక ఈ పాట పాడినందుకు తనకు లక్ష రూపాయలు ఇచ్చారంటూ ఒక ఇంటర్వ్యూలో 5000 ఇచ్చారంటూ మరొక ఇంటర్వ్యూలో ఈయన కామెంట్లు చేయడం గమనార్హం.

మొత్తానికి ఈ పాట పెట్టడం వల్ల తాను సంతోషంగా ఉన్నానని ఈయన వెల్లడించారు.

"""/" / ఇలా కుర్చీ మడత పెట్టి (Kurchi Madatha Petti) అనే పాట ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి కుర్చీ తాత తాజాగా ఆర్టీసీ బస్సులలో భిక్షాటన( Begging ) చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.

ఈయన ఆర్టిసి బస్సులలో ప్రయాణికులను భిక్షం అడుగుతూ కనిపించారు నన్ను కుర్చీ తాత అంటారండి నాకు ఇవ్వడానికి రూపాయి కూడా లేదా అంటూ ఈయన బిక్షం అడుగుతూ కనిపించడంతో ఎందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"""/" / ఇక ఈయనకు సంబంధించినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు అదేంటి పాట పాడటం కోసం లక్ష రూపాయలు తీసుకున్నటువంటి ఈ తాత భిక్షాటన చేయడమేంటి ఆశ్చర్యంగా ఉందే అంటూ కామెంట్ లు వ్యక్తం చేస్తున్నారు.

అయితే మరి కొందరు మాత్రం ఈయన నిజంగా భిక్షాటన చేయట్లేదని ప్రమోషన్లలో భాగంగానే ఇలా చేస్తున్నారు అంటూ కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో సినిమాలను ప్రమోట్ చేయడం కోసం సెలబ్రిటీలు విభిన్నదారులు వెతుకుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కుర్చీ తాత కూడా ఇలా సరికొత్తగా ఏమైనా ప్రమోషన్స్ చేస్తున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే ఈ విషయంపై కూడా కుర్చీ తాత స్పందించాల్సి ఉంది.

తాళి నా మొహాన విసిరికొట్టింది.. 32 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగా.. నటి మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు!