కారు దొర కాసులకు కక్కుర్తి- కమ్యూనిజానికి అపకీర్తి!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:సిపిఎం,సిపిఐ పార్టీల నాయకుల తాకట్టు రాజకీయాలపై కమ్యూనిస్టు నేతాజీ కామ్రేడ్ బోసన్న బహిరంగ లేఖ సంధించారు.
మునుగోడు అంగడిలో ఆశయాలను అమ్ముకున్న దగాకోరు విధానాల్ని ఖండించండి అంటూ ఎర్రజెండా ముసుగులో దొరల గడీల బాడుగలుగా మారిన సిపిఎం,సిపిఐ పార్టీలు ఎర్రజెండాను ఏట్లో ముంచినారని,కమ్యూనిజాన్ని కాట్లో పెట్టినారని, సిపిఎం,సిపిఐ దగాకోరు నాయకుల విధానాలపై ధ్వజమెత్తుతూ బోరన్న వ్రాసిన లేఖాస్త్రం సంచలనంగా మారింది.
ఎలక్షన్లు,కలెక్షన్లు ఇదే సిపిఎం,సిపిఐ పార్టీల రాజకీయ దినచర్యని,ఎవడ్రా సిపిఎం,సిపిఐ పార్టీలను కమ్యూనిస్టులు అంటున్నది?కారు దొర కాసులకు కక్కుర్తి పడి,కమ్యూనిజానికి అపకీర్తి తెస్తున్నారని ఘాటుగా స్పందించారు.
మీ పార్టీల నుండి కమ్యూనిస్టు పేరు తొలగించుకోండి,కమర్షియల్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టుకోండని సిపిఎం,సిపిఐ పార్టీలకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న బహిరంగ లేఖలో ఉచిత సలహా ఇచ్చారు.
ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారు?సిపిఎం,సిపిఐ దివాలా కోరు విధానాలను ఎండగట్టండి,విప్లవ కమ్యూనిస్టు రాజకీయాలను బలపరచండని పిలుపునిచ్చారు.
ఇది సీపీఎం,సీపీఐ చేసిన వ్యూహాత్మక,చారిత్రాత్మక త(ఒ)ప్పిదమని,నల్లగొండలో తలదించుకున్న ఎర్ర జెంఢా అంటూ,బూర్జువాల భుజాలపై ఎర్రతుండు,
బద్మాష్‌ల బాటలో ఎర్రదండు,కాసులకు అమ్ముడుబోయిన పొ(తొ)త్తులు,దగుల్భాజీ నాయకులతో దగాపడ్డ కేడర్ అంటూ కమ్యూనిస్టు,విద్యార్థి,యువజన,కార్మిక సంఘాల్లో దీర్ఘకాలం పని చేస్తున్న బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఎంతో బాధతో,ఆవేదనతో సిపిఎం,సిపిఐ పార్టీల అగ్ర నాయకుల తాకట్టు విధానాలపై ఈ బహిరంగ లేఖ వ్రాశారు.
ఎన్నో త్యాగాలు,ఎంతో మంది రక్తతర్పణం, ఎందరి ఆశయాల కిరణం,ఎన్ని దశాబ్దాల ఆశాజ్యోతి ఎర్ర జెంఢా.
ఈ ఎర్ర జెంఢాను చూస్తే ఎర్రటి నెత్తురు నిప్పు కణికల్లా,సలసలకాగే కాసారంలో భుగ భుగ బుసలు కొట్టిద్ది.
అలాంటి జెంఢాను అవమానపరిచి భూర్జువా భూస్వాముల బుట్టలో వేసిన బద్మాష్‌ల బజారు సిద్ధాంత ధోరణిని కార్యకర్తలు ఎలా అర్ధం చేసుకోవాలని బోసన్న ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ని అవాంతరాలొచ్చినా ఎర్రజెండా కర్రను విడిచిపెట్టకుండా నిజాయితీగా పని చేసే కార్యకర్తల కళ్లు ఎంత ఎర్రబడాలనీ బోరన్నగారి గారి సుభాషన్న పేర్కొన్నారు.
నిత్యం అధికార పార్టీ పెట్టే ఆరళ్లు,కేసులు తట్టుకొని నిలబడుతున్న కార్యకర్తల త్యాగం ముందు ఈ పొత్తులు పెట్టుకునే తొత్తుల పదవులు పూచిక పుల్లలు.
ఈ నకిలీ కమ్యునిస్టులు కార్యకర్తలను అడిగి పొత్తులు పెట్టుకుంటున్నారా అని ప్రజాఉద్యమకారుడు సుభాషన్న నిలదీశారు.
జిల్లా మహాసభల్లో,రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మాణాల్లో ఈ కుహనా పొత్తుల గురించి చర్చ ఉందా? కమ్మనిజం పేరుతో చీడపురుగుల్లా తయారయిన ఈ నకిలీ కమ్మనిస్టులు ఎర్రజెండాను తాకట్టు పెట్టి సిద్దాంతాలను గోదాట్లో ముంచేశారు.
ఎవడిచ్చాడురా మీకు మా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టే అధికారం అని కార్యకర్తలు నిలదీస్తున్నారు.
మీరు పొత్తు పెట్టుకున్న పొగరు గిత్తలకు మా కార్యకర్తలు ఒక్క ఓటు కూడా వేయమని నల్లగొండ ఖిల్లా,కమ్యునిస్టు జెంఢా ప్రతిన పూనుతోంది.
చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దుబ్బల గుడిశెలు అన్న చందంగా ఈ నయా కమ్మనిస్టుల నకిలీ సిద్దాంతం వెగటు పుట్టిస్తోందని సామాజిక ఉద్యమకారుడు నేతాజీ పేర్కొన్నారు.
నికార్సయిన కార్యకర్తలు దీన్ని సమర్ధించుకోవాలో,తలదించుకోవాలో తెలియక,మూటలకు అమ్ముడు పోయిన అగ్రనాయకత్వాల అంగడి వ్యాపారం తెలిసి ఎర్ర రుమాలుతో కళ్లు తుడుచుకుంటున్న మాట వాస్తవం కాదా అని సుభాషన్న ప్రశ్నించారు.
ఈ పార్లమెంటరీ పంథా పేరుతో పదవులకు ఆశపడ్డ బద్మాశ్‌లు బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకొని కమ్యునిజాన్ని కార్పోరేటీకరణ చేసి సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న అపవాదు గత రెండు దశాబ్ధాల కాలంగా వినిపిస్తున్నా,నవ్విపోదురు గానీ మాకేంటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తున్న తీరు శోఛనీయమని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
వీళ్ల కమ్మయిజానికి కమ్యూనిజం కాలం చెల్లిపోయే ప్రమాదం దాపురించింది.వీళ్లు కార్యకర్తల కష్టాలు తీర్చకపోగా, వాళ్ల అమరత్వంపు నెత్తుటి ముద్దలతో ఆకలి తీర్చుకుంటున్నారని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ బోరన్న గారి నేతాజీ కన్నీరు పెట్టారు.
మునుగోడులో కమ్యునిస్టు పార్టీలు బహిరంగంగా అమ్ముడుపోవడాన్ని ఇటు కమ్యునిస్టు కార్యకర్తలు, దాని అభిమానులు,మేథావులు అడ్డంగా ఖండిస్తున్నారు.
కమ్యునిస్టు నేతల నేలబారు దిగజారుడు తనానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి లేదని బాహాటంగానే నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమ నాయకుడు బోరన్నగారి నేతాజీ సుభాషన్న విమర్శించారు.
టీఆర్ఎస్ తో పొత్తుకు కారణం తేల్చి చెప్పిన సామాజిక పరివర్తకుడు సిపిఐ ఎంఎల్ కార్యదర్శి బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖ.
1.టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్ కాలరాసి,రీయంబర్స్మెంట్ కు నామం పెట్టి, అడ్డగోలుగా ఇంజనీరింగ్ ఫీజులు పెంచి సామాన్యుడిని విద్యకు దూరం చేసినందుకు కమ్యునిస్టు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయట.
2.ఇంటర్మీడియట్ విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడి,ఆత్మహత్యలకు పాల్పడ్డ పాపానికి పరిహారంగా వారి గోడు విని మునుగోడులో మద్దతు పలుకుతున్నాయట.
3.వీఆర్ఓలను,వీఆర్ఏలను రోడ్డుమీద పడేసి, గ్రామీణ రెవిన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ధరణి వెబ్ సైట్ మహమ్మారిని రుద్దినందుకు, మూణ్నెళ్లకోసారి మార్కెట్ వేల్యూ పెంచి మూలిగే రైతులపై బండలు వేస్తున్నందుకు కమ్యునిస్టు పార్టీలు టీఆర్ఎస్‌తో అవగాహనకు వచ్చాయట.
4.తమ కార్యకర్తలను,కమ్యునిస్టు పార్టీలో ఉన్నందుకు వేధింపులకు గురి చేస్తున్నందుకు,వారిపై అబద్దాల కేసులు మోపి కోర్టుల చుట్టూ తిప్పుతున్నందుకు టీఆర్ఎస్ పార్టీతో అవగాహనకు వచ్చిట్టు బోగట్టా.
5.రైతుల చేతులకు భేడీలు వేసినందుకు,గిట్టుబాటు ధర అంటే గిట్టనందుకు కమ్యునిస్టు పార్టీలు ఆ పార్టీతో జట్టు కట్టాయట.
6.ముంపు ప్రాంతాల్లో రైతులను నిండా ముంచి పరిహారాన్ని పరిహాసం చేసి పగబట్టి పలహారం చేసినందుకు,గ్రీన్‌ఫీల్డ్ రైతుల మొర వినకుండా అడ్డంగా ఆ పార్టీ నేతలు దోచుకుంటున్నందుకు కమ్మనిస్టులు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారట.
7.పోడు రైతులను జైళ్లల్లో పెట్టి,అటవీ హక్కుల చట్టాన్ని అటకెక్కించి అమాయక గిరిజనుల నోళ్లల్లో మన్ను కొట్టినందుకు బహుమతిగా మునుగోడును ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాయట.
8.రాలిన పూవుల రాగాల సాక్షిగా పారిన నెత్తుటి ప్రవాహాల దీక్షగా,అమరుల త్యాగాలను,కరుడు గట్టిన కరెన్సీ నోట్లకు అమ్ముకునేందుకు కమ్మనిస్టులు అక్కడ అవగాహనకు వచ్చారట.
9.కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ వ్యవస్థలతో పాలనా రంగాన్ని భ్రష్టు పట్టించి,కట్టు బానిసలుగా మార్చి, ఉద్యో్గాలను నోటిఫికేషన్‌ల దగ్గరే క్యూలో నిలబెట్టి, బంగారు తెలంగాణలో చదువుకున్న యువకులను బికార్లుగా మారుస్తున్నందుకు అభ్యుదయ నినాదం అవగాహనతో మద్దతు కురిపిస్తుందట.
10.మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల లోటు బడ్జెట్‌గా తీర్చిదిద్ది,రాష్ట్రాన్ని దివాళా తీయించేందుకు సిద్ధమై,జాతీయ పార్టీ పెట్టి,జాతి సంపద పై కన్నేసిన ఆ పార్టీతో జాతీయ పొత్తు కోసం మునుగోడును వరంగా ఇవ్వాలనుకున్నారట.
11.ఇంత మంది అమరుల కుటుంబాల శాపనార్ధాలు మీకు తగలవా? ఇంత మంది కమ్యునిస్టు శాపగ్రస్థుల గో్డు మీకు తగలదా? ఎన్ని స్థూపాల నీడలు మిమ్మల్ని నీడలా వెంటాడవా? కమ్యునిస్టు ముసుగులో దాగిన మార్జాల మర్కటాల్లారా ఎందుకింత సిద్ధాంత ద్రోహం?ప్రాంతం వాడే ద్రోహం చేస్తే పాతరేయమన్నాడు కాళోజీ,పార్టీ పెద్దే ద్రోహం చేస్తే ఏం చేయాలో చెప్పలేదనుకోకండి.
మునుగోడులో ఎలా చెయ్యాలో చూపిస్తాం అంటున్నారు నిజమైన కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు.12.
ఎక్కడ్రా మతవాద,చాందసవాద పార్టీలు?ఎన్ని ఆలయాలను నిర్మించాయి మతతత్వం మాటున?ఎన్ని మసీదులను కూలదోశాయి? ఎన్ని చర్చిలను పడగొట్టింది మతతత్వం? ఈ దేశ అత్యున్నత పదవికి అర్హుణ్ణి చేసి అబ్ధుల్ కలాం అనే ముస్లింను నెత్తిన పెట్టుకుంది మతతత్వం.
ఎప్పుడో వచ్చే మతతత్వం అనే బూచి చూపి ఈ బూర్జువా బూటకపు కమ్యునిస్టు నేతలు,కార్యకర్తల కన్నీళ్లను,కష్టాలను సొమ్ము చేసుకొని,విలువలను తుంగలో తొక్కి బుంగ నింపుకుంటున్నారని పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు కామ్రేడ్ హోసన్న ధ్వజమెత్తారు.
పార్లమెంటు,అసెంబ్లీలు పందుల దొడ్లు పనికిమాలిన వెధవలకు బాతకాని క్లబ్బులుగా అభివర్ణించిన కామ్రేడ్ తర్మిల నాగిరెడ్డి యొక్క పోరాటా స్ఫూర్తిని కొనసాగించాలని ప్రజా ఉద్యమ నాయకుడు కామ్రేడ్ సుభాష్ అన్న పేర్కొన్నారు.
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య,చండ్ర రాజేశ్వరరావు,చండ్ర పుల్లారెడ్డి లాంటి ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఎర్రజెండాను పాలకవర్గాలకు తాకట్టు పెట్టడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని సిపిఎం,సిపిఐ పార్టీలు మరొకసారి మునుగోడు విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని,ప్రజా పోరాటాలను బలోపేతం చేయుటకు కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ జరగాలని, సీట్లు ఓట్లు కాకుండా సిద్ధాంత ప్రాతిపదికన ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయుటకు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని,అణగారిన వర్గాల అభ్యున్నతిని కోరుకునే వేదికగా కమ్యూనిస్టు పార్టీలు బలోపేతం కావాలని,పీడిత జన పోరాట పిడికిలి కామ్రేడ్ బోసన్న సూచించారుఅమ్ముడు పోయిన ఆకలి రాజ్యంలో కమ్మనిస్టులకేం తెలుసు కమ్యునిస్టుల కడుపు కోతలు,మునుగోడు పెనుగాలై వీస్తుంది.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు నేల రాలనున్నాయి.మరో వసంత మేఘ ఘర్జనకు ఆవిరి తోడవుతుంది.
కమ్మనిస్టుల కాపలా తీసి నికార్సయిన నిజాయితీగల నాయకుడితో కమ్యూనిజం రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.
ఈ బహిరంగ లేఖ ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి,కించపరిచేందుకు కమ్యూనిస్టు నేతాజీ బోరన్నగారి సుభాషన్న రాసింది కాదని బలహీన వర్గాల రాజ్యాధికారం బివిఆర్ ప్రెసిడెంట్ మహాత్మా గాంధీజీ పేర్కొన్నారు.
నికార్సయిన కమ్యునిస్టుల గుండె గొంతుక వినిపించేందుకు అమరవీరుల త్యాగాలను ఎత్తి పడుతూ కార్మికవర్గ పోరాటయోధుడు కామ్రేడ్ బోరన్నగారి సుభాషన్న సిపిఎం,సిపిఐ పార్టీల తాకట్టు రాజకీయాలపై హోసన్న గారు రాసిన బహిరంగ లేఖను బి.
8328277285 ప్రశంసించారు.కరుడుగట్టిన కమ్యునిస్టు నాయకుడు శ్రామిక వర్గ ప్రజా పోరు మార్గదర్శి బోరన్నగారి సుభాషన్న కలం నుంచి రాలిని నెత్తుటి చుక్కలుగా నిరుద్యోగుల,నిరుపేదల, నిర్భాగ్యుల గొంతుకగా కామ్రేడ్ బోరన్నగారి సుభాషన్న ప్రజల పక్షాన ప్రశ్నలు ఎక్కు పెడుతున్నారని బహుజన జనతా రాజ్యం బిజెఆర్ చైర్మన్ సర్దార్ పటేల్ 9848540078 అభివర్ణించారు.
ఒంటికి చలువని సమ్మర్‌లో పెరుగు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!