పవన్ కల్యాణ్ తో కాకినాడ జిల్లా టీడీపీ ప్రతినిధుల భేటీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కాకినాడ జిల్లా టీడీపీ ప్రతినిధులు కలిశారు.

గత మూడు రోజులుగా కాకినాడలో పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల టీడీపీ నేతలతో పవన్ సమావేశం అయ్యారు.

మూడు రోజుల సమీక్ష తరువాత వివరాలను జనసేనాని టీడీపీ నేతలకు వివరించనున్నారు.అలాగే ప్రధానంగా జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు టీడీపీ - జనసేన ఏ విధంగా ముందకు వెళ్లాలనే అంశంపై నేతలు ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.

గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలకు చెందిన నేతలను కలుపుకుని ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ ఆకులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.. తెలుసా?