కీళ్ల నొప్పులతో బాధ పడే వారికి కాకరకాయ దివ్య ఔషధం.....
TeluguStop.com
ఈ రోజుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.చిన్న వయస్సు వారి నుంచి పెద్దవారి వరకు కీళ్ల నొప్పులతో నడవలేక ఇబ్బంది పడుతున్నారు.
దీనికి కారణం యూరిక్ యాసిడ్.ప్రస్తుత కాలంలో యూరిక్ ఆసిడ్ సమస్య చాలా ఎక్కువ అయిపోయింది.
మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.అలాగే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు ఉన్నాయి.మందులను వాడుతూ కూడా కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటిస్తే తొందరగా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు.
ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.
ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది.ఒకవేళ మూత్ర విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది.
అవి ఎక్కువగా స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది.
ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.యూరిక్ యాసిడ్ ని తగ్గించటానికి కాకరకాయ సహాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే కాకరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అదే విధంగా కాకరకాయలో ఉన్న పోషకాలు యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి తోడ్పడుతుంది అని నిపుణులు చెబుతున్నారు.
కాకరకాయలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
కాకరకాయను జ్యూస్ గా తయారు చేసుకుని తీసుకుంటే మంచిది. """/"/
కాకరకాయను తీసుకోవడం వల్ల యూరిక్ స్థాయిలు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.
అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.బరువు సమస్యతో బాధపడుతున్న వారు తరచూ కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల బరువు తగ్గుతారు.
కాలేయ పనితీరు మెరుగుబడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే కాకరకాయ చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది.
విజయ్ త్రిష మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు.. జస్టిస్ ఫర్ సంగీత అంటూ?