కాజు ఫేస్ ప్యాక్‌.. వారంలో 2 సార్లు ట్రై చేస్తే మ‌స్తు బెనిఫిట్స్‌!

కాజు(జీడిప‌ప్పు)చాలా మంది ఇష్టంగా తినే న‌ట్స్‌లో ఇది ఒక‌టి.హాట్‌, స్వీట్ అనే తేడా లేకుండా వంట‌ల్లోనూ జీడిప‌ప్పును విరి విరిగా వినియోగిస్తుంటారు.

అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉండ‌ట‌మే కాదు.ఎన్నో అమోఘ‌మైన పోష‌కాలు సైతం జీడిప‌ప్పులో నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా కాజు అనేక లాభాల‌ను అందిస్తుంది.అలాగే చ‌ర్మ‌ సౌంద‌ర్యానికీ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది.

ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే కాజు ఫేస్ ప్యాక్‌ను వారంలో రెండంటే రెండు సార్లు ట్రై చేస్తే గ‌నుక మ‌స్తు స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ ఫేస్ ప్యాక్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ప‌ది నుంచి ప‌దిహేను జీడిప‌ప్పులు, ఒక క‌ప్పు రోజ్ వాట‌ర్ వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్ మ‌రియు మొద‌ట త‌యారు చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ వేసి అన్ని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ముఖానికి ఏమైనా మేక‌ప్ ఉంటే పూర్తిగా తొల‌గించి.గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఆపై త‌యారు చేసుకుని మిశ్ర‌మాన్ని బ్రెష్ సాయంతో ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.అప్పుడు నార్మ‌ల్ వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.

"""/" / ఈ ఫేస్ ప్యాక్‌ను వారంలో రెండు సార్లు యూజ్ చేస్తే గ‌నుక‌.

ముఖ చ‌ర్మం తెల్ల‌గా, కాంతివంతంగా మారుతుంది.పిగ్నెంటేష‌న్ స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.

ఏజింగ్ ప్రాసెస్ ఆల‌స్యమ‌వుతుంది.మ‌రియు స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్‌గా త‌యార‌వుతుంది.

Tirumala : తిరుమల నడకదారి సమీపంలో మరోసారి వన్యమృగాల సంచారం..!!