మరో వివాదంలో చిక్కుకున్న కాజోల్.. ఆ సినిమా కలెక్షన్ల లెక్కల్లో మోసం జరిగిందా?

బాలీవుడ్ నటి స్టార్ హీరోయిన్ కాజోల్( Kajol ) గురించి మనందరికీ తెలిసిందే.

బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది కాజోల్.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి మెప్పించింది కాజోల్.

ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొకసారి వివాదంలో చిక్కుకుంది.ఇటీవల కాలంలో కాజోల్ ఎక్కువగా వరుసగా వివాదాల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

"""/" / ఈ నేపథ్యంలోని తాజాగా ఈమె బాలీవుడ్ స్టార్ హీరోనే ఉద్దేశిస్తూ సరదాగా చేసిన వ్యాఖ్యలు కాస్త తీవ్ర దుమారం రేపడంతో పాటు వివాదాస్పదంగా మారాయి.

దాంతో సదరు హీరో అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.కాజోల్‌ తాజాగా నటించిన కోర్టు రూమ్‌ డ్రామా ది ట్రయల్‌.

సుపర్ణ్‌ వర్మ వహించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ ఇంటర్వ్యూలో భాగంగా షారుఖ్‌ ఖాన్‌ గురించి అడగగా కాజోల్ స్పందిస్తూ.

ఆయనతో నాకు మంచి స్నేహం ఉంది. """/" / మళ్లీ ఒక రొమాంటిక్‌ సాంగ్‌ చేయాలని ఉంది అని కాజోల్‌ తెలిపింది.

అనంతరం ఒకవేళ ఇప్పుడు షారుఖ్‌ ఖాన్ ( Shah Rukh Khan )ఎదురైతే ఆయన్ని మీరు అడిగే ఒకేఒక్క విషయం ఏమిటి? అని యాంకర్ ప్రశ్నించగా.

పఠాన్‌ నిజమైన కలెక్షన్స్‌ ఎంతో చెప్పమంటాను అని బదులిచ్చింది.ఆమె పఠాన్‌( Pathaan ) కలెక్షన్స్‌ను ఉద్దేశిస్తూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

దీంతో షారుక్ ఖాన్ అభిమానులు కాజోల్ పై మండిపడుతున్నారు.కాగా షారుఖ్ ఖాన్ నటించిన పటాన్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు దాదాపుగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

దీంతో ఆ వార్తలను ఉద్దేశించి కాజోల్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది.

మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..!