నా బాయ్ ఫ్రెండ్ గురించి మా ఆయనకు తెలుసంటున్న హీరోయిన్...

బాలీవుడ్లో తాజాగా విడుదలైన టువంటి తానాజీ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఓమ్ రావత్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, కాజోల్, నేహ శర్మ, జగపతిబాబు, వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.

తాజాగా ప్రముఖ హీరోయిన్ కాజల్ ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా తమ వ్యక్తిగత విషయాలను కొన్ని తన అభిమానులతో పంచుకున్నారు.అయితే ఇందులో భాగంగా తనకు అజయ్ దేవగన్ తో పెళ్లి కాకముందు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండే వాడని చెప్పుకొచ్చారు.

ఈ విషయం గురించి అజయ్ దేవగన్ కి కూడా తెలుసని అన్నారు.అయితే అతడితో కొన్ని రోజులు ప్రేమలో ఉన్నానని ఆ తర్వాత మా మధ్య మనస్పర్థల కారణంగా విభేదాలు వచ్చాయని దాంతో విడిపోయామని చెప్పారు.

దాంతో మళ్లీ తప్పు జరుపుకూడదని తాను అజయ్ దేవగన్ నాలుగు సంవత్సరాల కాలం పాటు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చారు.

"""/"/అయితే తన ఇష్టాలని అజయ్ ఎంతో  గౌరవిస్తాడని అంతేగాక తమ పిల్లల విషయంలో కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడని చెప్పుకొచ్చింది కాజోల్.

అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ జంటను బాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ గా అందరు చెప్పుకుంటారు.

అందుకు తగ్గట్టుగానే కాజల్ అజయ్ దేవగన్ లు కూడా అంతే అన్యోన్యంగా ఉంటారు. .

మెడ మొత్తం నల్లగా అసహ్యంగా మారిందా.. ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోండిలా..!