అరడజను సినిమాలతో సూపర్ ఫాం లో కాజల్..!

ఒకప్పుడు హీరోయిన్ కి పెళ్లైంది అంటే దాదాపు కెరీర్ ముగిసినట్టే.కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో రెచ్చిపోతున్నారు అందాల భామలు.

బాలీవుడ్ లో ఈ పంథా ఎప్పటి నుంచో కొనసాగిస్తుంటే ఈమధ్య సౌత్ లో కూడా పెళ్లైన హీరోయిన్స్ ఛాన్స్ లు అందుకుంటున్నారు.

ఈ లిస్ట్ లో ఇప్పుడు కాజల్ కూడా చేరింది.బోయ్ ఫ్రెండ్ గౌతం ని పెళ్లాడిన కాజల్ పెళ్లి తర్వాత ఒకటి రెండు సినిమాలు ఓకే చేసినా ప్రెగ్నన్సీ వల్ల వాటిని ఆపేసింది.

ఇక బాబుకి జన్మనిచ్చిన అమ్మడు ఇప్పుడు మళ్లీ కెరీర్ మీద దృష్టి పెట్టింది.

"""/" / ప్రస్తుతం ఇండియన్ 2, ఎన్.బి.

కె 108 సినిమాలతో పాటుగా మరో నాలుగు సినిమాలు చేస్తుందట కాజల్.వాటిలో తమిళం లోనే 3 సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది.

మొత్తానికి కాజల్ మళ్లీ ఫాం లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు.అరడజను సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ కి ట్రీట్ అందిస్తుంది కాజల్.

చూస్తుంటే అమ్మడు ఇక వరుస సినిమాలు చేసేలా ఉంది.అయితే కమర్షియల్ సినిమాల కన్నా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది.

తెలుగులో చేస్తే అలాంటి సినిమాలే చేయాలని అనుకుంటుందట.

పేదలకు ఇళ్ల పంపిణీ పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ