కాస్ట్ లీ గా కాజల్… సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

కాజల్ అగర్వాల్ పెళ్లి అయ్యి దాదాపు నెల కావస్తున్నా సోషల్ మీడియాలో తన రేంజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ తెగ హల్చల్ చేస్తోంది.గత నెల అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ తో ముంబైలోని తాజ్ హోటల్ లో ఘనంగా వీరి వివాహం జరిగింది.

అయితే ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు ,వివాహానికి కాజల్ వేసుకున్న డ్రస్ గురించి ఓ రేంజ్ లో చర్చలు సాగాయి.

వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ తన వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వివాహం అనంతరం నూతన గృహ ప్రవేశం చేసిన ఈ దంపతులు హనీమూన్ ట్రిప్ కి మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే.

మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తూ హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట ఎప్పటికప్పుడు ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటున్నారు.

"""/"/ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన 15 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.

మొన్నటి వరకు కాజల్ తన వివాహానికి వేసుకున్న డ్రెస్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాజల్ అగర్వాల్ పెళ్లి కి ధరించిన గులాబిరంగు లెహంగా దాదాపుగా 20 మంది వర్కర్స్ నెల రోజుల పాటు ఎంతో కష్టపడి అందంగా డిజైన్ చేసిన ఆ లెహంగా ఖరీదు 3 లక్షలు అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

"""/"/ అయితే ప్రస్తుతం మాల్దీవుల్లో కాజల్ అగర్వాల్ నటించిన ఎరుపురంగు సెమీ షీర్‌ దుస్తుల రేటు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ర్యాట్‌ అండ్‌ బోవా బ్రాండ్ కు చెందిన ఈ డ్రెస్సు ఖరీదు దాదాపు 13 వేల రూపాయలట.

ఈ డ్రెస్ కు తగ్గట్టుగానే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్,హ్యాట్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్ అగర్వాల్ కుర్రకారు మతి పోగొడుతుంది.

ఏది ఏమైనా కాజల్ అగర్వాల్ కాస్ట్ లీ దుస్తులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సినిమాల విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ త్వరలోనే ఆచార్య చిత్రనిర్మాణంలో పాల్గొన్నట్లు సమాచారం.

హైదరాబాద్ చేరుకోగానే ఈ జంట ఓ పెద్ద పార్టీని అరెంజ్ చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

బన్నీ విషయంలో అలా కామెంట్ రైటేనా నాగబాబు.. ఎన్నికల ముందే చేసి ఉండొచ్చుగా?