కాజల్ దంపతుల నూతన గృహ ప్రవేశ పూజ
TeluguStop.com
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా కొన్ని కోట్ల మంది హృదయాలను దోచుకుంది.
ఆమె పెళ్లి ఎంతో మందికి ఆనందాన్ని కలిగించింది.మరి కొందరికి ఆమె తమకు బ్రేకప్ చెప్పి వెళ్లి పోయింది అంటూ బాధ పడ్డారు.
మొత్తానికి కాజల్ పెళ్లి విషయమై గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఫొటోలు వీడియోలు చర్చ జరుగుతుంది.
పెళ్లి తంతు ముగిసింది అనుకుంటూ ఉండగా ఫొటో షూట్ ఫొటోలను కాజల్ షేర్ చేసింది.
ఆ తర్వాత ఆమె భర్త గురించిన విషయాలను వెళ్లడించడం, తమ ప్రేమ కథను వెళ్లడించడంతో మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ నేపథ్యంలో దంపతులు మరోసారి వైరల్ అయ్యారు.ఈ సారి ఈ కొత్త జంట ఒక పూజలో ఉన్నారు.
ఈఫొటోను కాజల్ భర్త గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.నా అద్బుతమైన భార్య కోసం ఒక కొత్త ఇల్లు అంటూ కామెంట్ పెట్టి నూతన గృహ ప్రవేశంకు సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు.
ఈ గృహ ప్రవేశ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది.పెళ్లి అయ్యి వారం కూడా కాకుండానే కాజల్ మరియు గౌతమ్‌లు వేరు కాపురం పెట్టేందుకు ఇల్లు తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.
కాజల్ ఇప్పటి వరకు చాలానే సంపాదించింది అయినా కూడా గౌతమ్ తన సొంత ఖర్చులతో భార్య కాజల్ కోసం ఇల్లు తీసుకున్నాడు.
ఈ ఇల్లు చాలా నెలల క్రితమే వీరు తీసుకున్నారు.గత కొన్నాళ్లుగా ఆ ఇంటికి సంబంధించిన పనులు ఇద్దరు కలిసి తమ అభిరుచికి తగ్గట్లుగా చేయించుకున్నారు.
ఇటీవలే ఆమె ఫైనల్ గా ఇల్లు పనులు పూర్తి చేయించారు.తాజాగా నేడు ఇంటికి సంబంధించిన ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో కాజల్ మరియు గౌతమ్ ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాలు నిర్వహించి గృహ ప్రవేశంను చేశారు.
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ 2000 కోట్ల క్లబ్ లో చేరుతారా..?