Upasana : కాజల్ పేరు నా దగ్గర మాట్లాడవద్దు… యాంకర్ కు కౌంటర్ ఇచ్చిన ఉపాసన?
TeluguStop.com
మెగా కోడలుగా ఉపాసన ( Upasana ) ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు.
అయితే రామ్ చరణ్ ( Ramcharan ) ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈమె తన వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా ఒకవైపు బిజినెస్ ఉమెన్ గా కొనసాగుతూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో మంచి మనసున్న అమ్మాయిగా మెగా ఇంటి ప్రతిష్టలను పెంచుతూ వచ్చారు.
ఈ విధంగా ఉపాసన రామ్ చరణ్ కు సరైన జోడి అనిపించుకున్నారు.అయితే గతంలో ఉపాసన రాంచరణ్ మధ్య ఓ హీరోయిన్ కారణంగా గొడవలు వచ్చాయి అంటే ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తల గురించి ఎలాంటి క్లారిటీ లేదు.కొంతమంది డైరెక్టర్లు అవసరం లేకపోయినా రొమాంటిక్ సన్నివేశాలు జోడిస్తున్నారని ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా గోవిందుడు అందరివాడే సినిమాలో కాజల్ ( Kajal ) రామ్ చరణ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉపాసనకు నచ్చలేదు.
"""/" /
ఇలా కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ కాంబినేషన్లో మగధీర గోవిందుడు అందరివాడే నాయక్ ఎవడు వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ సినిమా సమయంలోనే రామ్ చరణ్ పట్ల ఉపాసన కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఇకపోతే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ నుంచి ఉపాసనకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
"""/" /
ఆన్ స్క్రీన్ పై రామ్ చరణ్ కు సరైన జోడి అని మీరు ఎవరిని అనుకుంటున్నారు అంటూ ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు ఉపాసన సమాధానం చెబుతూ తనకు పర్ఫెక్ట్ జోడి ఎవరు అనేది మీరే చెప్పాలి అంటూ సమాధానం చెప్పారు దీంతో కాజల్ అగర్వాల్ అంటూ యాంకర్ చెప్పగా వెంటనే ఉపాసన ఎందుకు కియారా అద్వానీ కాకూడదు? ఎందుకు ప్రియాంక చోప్రా కాకూడదు?, ఎందుకు తమన్నా కాకూడదు అంటూ సమాధానం ఇచ్చింది.
దీనిని బట్టి చూస్తుంటే కాజల్ అగర్వాల్ పేరంటే కూడా తనకు నచ్చదని గతంలో కాజల్ విషయంలోనే రామ్ చరణ్ ఉపాసన మధ్య గొడవలు వచ్చిన మాట కూడా వాస్తవమేనని పలువురు ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?