ఎలాంటి అప్డేట్ లేకుండానే రిలీజ్ కాబోతున్న కాజల్ మూవీ.. అదేంటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.

పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది కాజల్.

పెళ్లి అయినా కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

పెళ్లి తర్వాత ప్రెగ్నెంట్ కావడంతో కొద్దిరోజుల పాటు సినిమాలకు దూరమైన కాజల్ ఇప్పుడిప్పుడే సినిమాలలో ఫుల్ బిజీబిజీగా మారుతోంది.

ప్రస్తుతం కాజల్ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవత్ కేసరి సినిమా( Bhagavath Kesari )లో నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే కమల్ హాసన్, శంకర్ రాంబోలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది.

"""/" / అలాగే కొద్ది రోజుల క్రితం కాజల్ ప్రధాన పాత్రలో తమిళంలో కరుంగాపియం చిత్రం రూపొందింది.

హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమాను ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు.

తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది.శ్రీ వెంకటసాయి ఫిలిమ్స్ వారు ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.

తెలుగులో కార్తీక( Karthika ) అనే పేరుతో ఈ సినిమాను జూలై 21న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కనిపించడం లేదు.అయితే ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ గుర్తుచేశారు మూవీ మేకర్స్.

"""/" / విడుదల సమయం దగ్గరకు వస్తోన్న సినిమా పబ్లిసిటీ ఏమాత్రం లేదు.

ఎలాంటి ప్రచార కార్యక్రమాలు లేకుండా నేరుగా ఈ మూవీని థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమా గురించి ఎటువంటి ప్రమోషన్స్ కానీ పోస్టులు కానీ పెట్టకుండా డైరెక్ట్ గా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్సెస్ సిద్ధం చేస్తున్నారు మూవీ మేకర్స్.

ఈ సినిమా విడుదల కాబోతోంది అనే ఎవరికి కూడా తెలియకపోవడం గమనార్హం.ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ మేరకు సాధిస్తుందో చూడాలి మరి.

ఇండియన్ పాలిటిక్స్ లో బాబాయ్ రియల్ గేమ్ ఛేంజర్…చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!