బాబు పుట్టిన రెండు నెలలకే అలాంటి పెయిన్.. కాజల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కాజల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

కళ్యాణ్ రామ్ హీరోగా 2007లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

కానీ కాజల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఆ తర్వాత తెలుగులో టాలీవుడ్లో టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

"""/" / ఇకపోతే కాజల్ కరోనా సమయంలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ దంపతులకు ఒక బాబు కూడా జన్మించాడు.అయితే పెళ్లయి బాబు పుట్టిన తర్వాత కూడా కాజల్ ఏ మాత్రం తగ్గడం లేదు.

కాగా కాజల్ అగర్వాల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ చేసిన సినిమా సత్యభామ( Satyabhama ).

ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కాజల్.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.నాకు బాబు పుట్టిన తర్వాత రెండు నెలల్లోనే హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను ఇండియన్ 2( Indian 2 ) సినిమా కోసం.

"""/" / అప్పుడు చాలా పెయిన్ అనుభవించాను.కానీ కష్టపడి నన్ను నేను బిల్డ్ చేసుకున్నాను.

నాలుగేళ్ళ క్రితం ఓకే చేసిన సినిమా అది.నేను వద్దు అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళని తీసుకుంటారు.

కాని నేను ఆ సినిమా చేయాలనుకున్నాను.శంకర్ సర్ కూడా నా డేట్స్ అడ్జస్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసి సపోర్ట్ ఇచ్చారు.

నీ ప్లేస్ లో ఇంకొకరిని తీసుకోను భయపడకు అని చెప్పారు శంకర్ సర్.

చాలా కష్టంగా ఉన్నా నేను ఇష్టపడి చేశాను, దానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను అని తెలిపింది.

అయితే బాబు పుట్టిన రెండు నెలలకే పెయిన్ అనుభవిస్తూ కూడా సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంది అంటే కాజల్ కి సినిమాపై ఎంత డెడికేషన్ ఉందో మరోసారి అర్ధమవుతుంది.

కాజల్ అభిమానులు, నెటిజన్లు ఈ విషయంలో ఆమెని అభినందిస్తున్నారు.

3000 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన సింగర్.. ఈ సింగర్ గ్రేట్ అంటూ?