ఆ హీరోతో పనిచేయడం చాలా ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన కాజల్!
TeluguStop.com
అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి తెలియని వారంటూ ఉండరు.లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.
తెలుగు తమిళ కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
కాజల్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తు వరుస అవకాశాలు అందుకుంటుంది.
కొంతకాలం క్రితం తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
దీంతో ఈ అమ్మడు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది.చివరిసారిగా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో నటించిన కాజల్ బిడ్డ పుట్టిన మూడు నెలలకె మళ్లీ సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది.
ఈ క్రమంలో కాజల్ కి భారతీయుడు 2 సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.
దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.అందువల్ల ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ లో కనిపిస్తూ సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదిస్తుంది.
అంతేకాకుండా తన భర్త బిజినెస్ కి కూడా సపోర్టింగ్ గా నిలుస్తుంది. """/"/
ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ లో నటించిన కాజల్ ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది.
ఈ యాడ్ లో భాగంగా రాపిడ్ ఫైర్ సెషన్‌ను ఎదుర్కొంది కాజల్.ఈ క్రమంలో మీకు కట్ చాయ్ ఇష్టమా? ఫిల్టర్ కాఫీ ఇష్టమా? అని కాజల్ ని అడగగా.
కట్ చాయ్ అంటే ఇష్టమని సమధానం చెప్పేసింది.ఇక మరోక సందర్భంలో సల్మాన్ ఖాన్‌తో అడ్వెంచర్లు చేస్తావా? షారుఖ్ ఖాన్‌తో రొమాంటిక్ డేట్‌కు వెళ్తావా? అని ప్రశ్న అడగగా.
సల్మాన్ ఖాన్‌తో అడ్వెంచర్లు చేస్తాను అని చాలా తెలివిగా సమధానం చెప్పి తన మనసులో మాట బయట పెట్టింది.
ఇలా కాజల్ అగర్వాల్ చెప్పిన ఈ సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పుష్ప 3 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన దేవి శ్రీ…. షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడేనా?