టాలీవుడ్ స్టార్ హీరోలపై కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

సినీనటి కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal ) తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే సత్యభామ( Satyabama ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమాలో ఈమె ఏసీపీ అధికారినిగా నటించబోతున్నారు.ఇక ఈ సినిమా మే 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈమె వరుస ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఎన్నో విషయాలను వెల్లడించారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ స్టార్ ( Tollywood Star S) హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"""/" / కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించారు.

ఈమె మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.కంప్లీట్ ప్యాకేజ్ అంటూ సమాధానం చెప్పారు.

బాలయ్య గురించి మాట్లాడుతూ చాలా ఫన్నీగా ఉంటారని వెల్లడించారు.ఇక రాంచరణ్ గురించి మాట్లాడుతూ.

ఆల్ రౌండర్.ప్రతి సినిమాకు ఆయన ఎదుగుతూ వచ్చారని తెలిపారు.

అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.ప్రతి సన్నివేశంలోనే ఎంతో అద్భుతంగా నటిస్తారు.

ఆయన నటించిన పుష్ప2 సినిమా కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. """/" / ఇక ఎన్టీఆర్ గురించి కాజల్ మాట్లాడుతూ చాలా టాలెంటెడ్ అని,మహేష్ బాబు గురించి చెప్పాలంటే చార్మింగ్ పర్సనాలిటీ అని కాజల్ అన్నారు.

ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.ఆయన గ్లోబల్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు.

మన సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాడని తెలిపారు.ఇలా ఈ హీరోలందరి గురించి ఈమె ఈ వ్యాఖ్యలు చేయటంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

అయితే వీరందరితో కలిసి కాజల్ అగర్వాల్ నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. .

ఆ జాబితాలో సైతం నంబర్ వన్ స్టార్ హీరోగా ప్రభాస్.. దేశంలోనే నంబర్ వన్ గా నిలిచారుగా!