భర్తతో కలిసి మందు తాగుతున్న కాజల్.. ఫోటో వైరల్..!
TeluguStop.com
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ నెలలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
మాల్దీవులకు వెళ్లి హనీమూన్ ఎంజాయ్ చేసిన కాజల్ భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలిచింది.
సాధారణంగా పది రోజుల హనీమూన్ ట్రిప్ కు 5 కోట్ల రూపాయలు ఖర్చు కాగా మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ లో భాగంగా కాజల్ ఉచితంగానే హనీమూన్ ను ఎంజాయ్ చేసిందని సమాచారం.
ఇకపోతే పెళ్లి తర్వాత కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఒక ఫోటోలో కాజల్ భర్తతో కలిసి మందు గ్లాసుతో ఫోజులిచ్చింది.పార్టీలో భాగంగా కాజల్ మద్యం తాగడంతో పాటు భర్త వీపుపై ఎక్కి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కాజల్ పార్టీని బాగా ఎంజాయ్ చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లి జరిగి నెలరోజులు గడిచినా కాజల్ ఇంకా భర్తతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
భర్త కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ తన బ్రాండ్ వాల్యూ ద్వారా కాజల్ కంపెనీ రేంజ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
క్రిస్మస్ నెల ప్రారంభం సందర్భంగా జరుపుకున్న పార్టీలో కాజల్ మద్యం తాగారని సమాచారం.
లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న కాజల్ పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ కొత్త హీరోయిన్లకు పోటీనిస్తున్నారు.ఆచార్య, భారతీయుడు సినిమాల్లో కాజల్ ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తోంది.
పెళ్లి తర్వాత కూడా గ్లామరస్ పాత్రల్లో నటించాలని కాజల్ భావిస్తున్నారని తెలుస్తోంది.తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు వచ్చినంత కాలం హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించాలని కాజల్ భావిస్తున్నారని సమాచారం.
మోక్షజ్ఞ ఎంట్రీకి ఈ సంవత్సరంలో అయిన మోక్షం లభిస్తుందా..?