కైకాల సత్యనారాయణకు కేజిఎఫ్ సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కైకాల సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో శుక్రవారం తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ ప్రముఖులు తనకు నివాళులు అర్పించారు.ఇకపోతే కైకాల సత్యనారాయణ హీరోగా విలక్షణ నటుడిగా నిర్మాతగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో సుమారు 700కు పైగా సినిమాలలో నటించిన కైకాల తుది శ్వాస విడిచారు.

శుక్రవారం తెల్లవారుజామున మరణించిన ఈయన అంత్యక్రియలను నేడు మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ విధంగా కైకాల మరణించడంతో ఎంతోమంది ఆయన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

ఈ క్రమంలోనే తాజాగా కన్నడ హీరో యశ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన చిత్రం కేజిఎఫ్.

ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమాకు కైకాల సత్యనారాయణకు ఓ సంబంధం ఉంది.అయితే ఆ సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే.

"""/"/ కేజిఎఫ్ చిత్రాన్ని సాయి కొర్రపాటి, హోంబలే మేకర్స్ విజయ్ కిరంగదూర్ లతోపాటు.

కైకాల సత్యనారాయణ కుమారుడు కలిసి నిర్మించారు.ఇలా కైకాల సత్యనారాయణ కుమారుడు కన్నడంలో ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఈ సినిమా తెలుగు హక్కులను కూడా కొనుగోలు చేసి తెలుగులో విడుదల చేశారు.

ఇక కే జి ఎఫ్ సినిమా విడుదల సమయంలో చిత్ర బృందం కైకాల సత్యనారాయణకు సన్మానం కూడా చేసిన విషయం తెలిసిందే.

అలాగే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా వచ్చిన కే జి ఎఫ్ 2 సినిమాకి కూడా కైకాల కుమారుడు సహనిర్మాతగా వ్యవహరించారు.

మెగా సంక్రాంతి సంబరాలకు అల్లు అర్జున్ వస్తారా… పోలీసులు అనుమతి ఇస్తారా?