BRS : మళ్లీ బీఆర్ఎస్‎కే కాగజ్‎నగర్ మున్సిపల్ ఛైర్‎పర్సన్ పీఠం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‎నగర్ మున్సిపల్ ఛైర్ పర్సన్(Kagaznagar Municipal Chairperson ) పీఠం మళ్లీ బీఆర్ఎస్ కే దక్కింది.

ఈ క్రమంలో కాగజ్‎నగర్ ఛైర్మన్ గా షాహిన్ సుల్తానా( Shaheen Sultana ), వైస్ ఛైర్మన్ గా సామిశెట్టి రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అయితే కాగజ్‎నగర్ మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్ ఉన్నారు.

కాగా జనవరి 20వ తేదీన అప్పటి మున్సిపల్ ఛైర్ పర్సన్ సద్దాం హుస్సేన్, వైస్ ఛైర్మన్ గిరీశ్ కుమార్( Girish Kumar ) పై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

దీంతో ఇవాళ కాగజ్‎నగర్ ఆర్డీవో సురేశ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సమావేశానికి 26 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.

వీరంతా షాహిన్ సుల్తానా, సామిశెట్టి రాజేందర్ కు మద్ధతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.

అనంతరం ఛైర్మన్ గా షాహిన్ సుల్తానా, వైస్ ఛైర్మన్ గా సామిశెట్టి రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు మిస్ చేసుకున్న 3 మంచి రీమేక్ సినిమాలు ఇవే.. ఏమైందంటే?