వకీల్ సాబ్ నుండి 'కదులు కదులు' సాంగ్ విడుదల..!

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా రాబోతున్న వకీల్ సాబ్ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ వచ్చింది.

మరొక రెండు రోజుల్లో విడుదల కాబోతుండగా ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ వీర లెవల్లో ఇస్తున్నారు.వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.ఈ సినిమా పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది.

బాలీవుడ్ లో పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించారు.ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. """/"/ పవన్ మూడేళ్ళ తర్వాత వెండితెరపై కనిపించబోతున్నాడు అందుకే పవన్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు ఈ సినిమా నుండి కదులు కదులు అనే పాట విడుదల అయ్యింది.

ఈ పాట నిన్ననే విడుదల కావాల్సిన నేపథ్యంలో కొన్ని టెక్నికల్ ప్రొబ్లమ్స్ రావడం వల్ల చిత్ర యూనిట్ నిన్న విడుదల చేయలేకపోయింది.

అందుకే ఈ రోజు ఈ పాటను విడుదల చేసారు.ఈ పాట మహిళలను చైతన్య పరిచేలా ఉంది.

ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ్ సాహిత్యం అందించారు.ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కాబోతుంది.

వైరల్ వీడియో: ఏంటి భయ్యా.. బతికున్న నల్లత్రాచుకు నేరుగా పూజలు చేస్తున్న కుటుంబం..