అద్దె కట్టలేదని ఆర్టీసీ బస్టాండే మూసేశారు, ఎక్కడంటే?

చాలా ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతాయి.ఎమ్మార్వో ఆఫీసులు, పాఠశాలలతో పాటు ఇతర చాలా కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతాయి.

అయితే ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె ఇవ్వడం అంటే సాహసం అనే చెప్పాలి.ఎందుకంటే ఆ అద్దె ఎప్పుడు వస్తుంది అనేది ఆ దేవుడు కూడా చెప్పలేడు.

నెల నెలా ఠంచనుగా ప్రభుత్వాలు అద్దె చెల్లించవు.కొన్ని సార్లు సంవత్సరాలుగా అద్దె కట్టకుండా ఉంటాయి.

అయితే అలాగే జరిగింది ఏపీలోని కడపలో.కడప నగరపాలక సంస్థ అధికారులు ఆర్టీసీ బస్డాండ్ ను మూసేశారు.

ఉదయం నుండి బస్టాండ్ లోకి బస్సులు రాకుండా ఆపేశారు.అద్దె కట్టాలని ఆర్టీసీ అధికారులను ఎన్ని సార్లు అడిగినా వాళ్లు స్పందించడం లేదని.

అందుకే బస్సులు బస్టాండ్ లోకి రాకుండా నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు.2013 నుండి ఆర్టీసీ అధికారులు నగరపాలక సంస్థకు దాదాపు 2 కోట్ల 30 లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి ఉంది.

ఈ మొత్తం చెల్లించడం లేదు.ఇది కాస్త పెరుగుతూ పోయింది.

కడప నగర పాలక సంస్థకు కొత్తగా వచ్చిన కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్.

చాలా సార్లు ఆర్టీసీ అధికారులను అద్దే విషయమై అడిగారు.కానీ, వారి నుండి ఎలాంటి స్పందన లేదు.

దీంతో చేసేది ఏమీ లేక.తెల్లవారు జాము నుండి బస్టాండ్ లోకి బస్సులు రాకుండా ఆపేశారు.

అయితే ప్రయాణికులు మాత్రం అధికారులు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడం కరెక్టు కాదని చెబుతున్నారు.

బంగాళదుంప వర్సెస్ చిలగడదుంప.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..!