సుప్రీంకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ అంశం

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పుపై సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.దీనిపై సుప్రీం ధర్మాసనం రేపు విచారణ జరిపే అవకాశం ఉంది.

అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఇదే కేసులో ప్రస్తుతం ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాలు చేయడం అందరి హీరోల వల్ల అవ్వదా..?