సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి..!

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరైయ్యారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపీ అవినాశ్ రెడ్డిని రెండు సార్లు విచారించారు అధికారులు.

తాజాగా మూడోసారి సీబీఐ ఎదుట అవినాశ్ రెడ్డి హాజరైయ్యారు.అయితే సీబీఐ నోటీసుల నేపథ్యంలో అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

సరైన విధానాల్లో తనను విచారించడం లేదని కోర్టుకు తెలిపారు.విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని, న్యాయవాది సమక్షంలో తనను విచారించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

అదేవిధంగా తనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.

అయితే పిటిషన్ పై ఇంకా విచారణ ప్రారంభం కాకపోవడంతో విచారణకు హాజరైయ్యారని సమాచారం.

జనవరి నెల బాక్సాఫీస్ రివ్యూ ఇదే.. మొత్తం సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్ అంటే?