నేడు మరోసారి సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు.

రెండు రోజులపాటు అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు పరిణామాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

అవినాశ్ రెడ్డి, వివేకా కుటుంబానికి మధ్య విభేదాలతో పాటు నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ప్రశ్నించింది.

రూ.40 కోట్ల డీల్ లో అవినాశ్ రెడ్డి పాత్రపై సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

అదేవిధంగా హత్య జరిగితే సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారని సీబీఐ ప్రశ్నించింది.అవినాశ్ రెడ్డి విచారణ మొత్తాన్ని సీబీఐ వీడియోగ్రఫీ చేస్తుంది.