సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి..!

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.ఇప్పటికే షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.

జూన్ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ముందస్తు బెయిల్ పొందిన తరువాత ఆయన రెండోసారి విచారణకు హాజరయ్యారు.

కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.