కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ హాజరుపై సందిగ్ధత
TeluguStop.com
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు అవుతారా? లేదా ? అన్ని విషయంపై సందిగ్ధత నెలకొంది.
ఇవాళ విచారణకు హాజరుకాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు.అయితే ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖపై సీబీఐ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరారు ఎంపీ అవినాశ్ రెడ్డి.
ఇవాళ విచారిస్తామని సీబీఐ ఇప్పటికే హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఉత్తర్వులు ఇచ్చేదాకా అవినాశ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు వెల్లడించింది.
వివేకా హత్య కేసులో ఎంపీ పాత్రపై ఆధారాలను సైతం సీబీఐ సమర్పించింది.అనంతరం అవినాశ్ పిటిషన్ లో మధ్యంతర ఉత్తర్వులపై తీర్పు వాయిదా వేసింది.
బాలయ్య బాబు ప్రయోగత్మాకమైన సినిమాలు చేయలేడా..?