కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ కీలక నిర్ణయం..
TeluguStop.com
కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.పోలీస్ ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాహనం కొనుగోలు చేసిన ఏఆర్ విభాగానికి చెందిన గన్ మన్ ను సస్పెండ్ చేశారు.
ఈ మేరకు గన్ మన్ పుష్పరాజ్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణంగా విధుల్లో ఉన్న పోలీసులు ఏదైనా వాహనం కోనుగోలు చేస్తే దానిపై ముందుగానే ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే అటువంటి పర్మిషన్ తీసుకోకుండానే పుష్పరాజ్ ఓ వాహనం కొన్నారు.ఈ విషయంపై విచారణ చేపట్టిన అధికారులు అవినీతి సొమ్మెతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
ఈ క్రమంలో గన్ మన్ పై సస్పెండ్ వేటు వేశారు.
బన్నీ అరెస్ట్ దేనికి సంకేతం.. సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండకపోతే చుక్కలే!