పవన్ ను సీఎం చేస్తా.. పులివెందులలో జగన్ ను గెలవకుండా చేస్తా.. కేఏ పాల్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సీఎం కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఓటమే లక్ష్యంగా కష్టపడుతున్నారు.తాజాగా కేఏ పాల్ పవన్ గురించి, జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
తాను తలచుకుంటే ఏపీలో జగన్ కు ఒక్క సీటు కూడా రాదని కేఏ పాల్ తెలిపారు.
"""/" /
పవన్ మాట్లాడితే పొలిటికల్ స్పీచ్ అని నేను మాట్లాడితే దైవ శాపం అని కేఏ పాల్ కామెంట్లు చేశారు.
తాను తలచుకుంటే పులివెందులలో కూడా జగన్ ( CM Jagan )ను గెలవకుండా చేయగలనని ఆయన చెప్పుకొచ్చారు.
తనపై దాడికి పాల్పడ్డ పోలీసులను అధికార పార్టీ సస్పెండ్ చేయాలని కేఏ పాల్ కోరారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష చేయగా పోలీసులు దీక్షను భగ్నం చేశారు.
ఎంపీలు రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా నేను ఆపుతానని కేఏ పాల్( K.
ఒరేయ్ జగన్ అని అనిపించుకోవద్దని కేఎల్ పాల్ కామెంట్లు చేశారు.పవన్ ను సీఎం చేస్తానంటూ ఆయన కామెంట్లు చేశారు.
నా శాపం వల్ల ఇప్పటికే ఏడుగురు చనిపోయారని జాగ్రత్త జగన్ అంటూ కేఏపాల్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
"""/" /
వైసీపీ నేతలు మాత్రం కేఏ పాల్ కామెంట్లను పెద్దగా పట్టించుకోవడం లేదు.
కేఏ పాల్ కామెంట్ల గురించి స్పందించడం వల్ల ప్రయోజనం శూన్యమని వైసీపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో జగన్ కు అనుకూలంగా కామెంట్లు చేసిన కేఏ పాల్ ఇప్పుడు మాత్రం జగన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
భారత్ బెస్ట్ అయితే అక్కని అమెరికాకు ఎందుకు.. కుర్రాడి క్వశ్చన్‌తో MTV యాడ్ సెన్సేషన్!