పొలిటికల్ మైలేజ్ కోసమే కేఏ పాల్ పాట్లు ??

అది మునుగోడు ఉపఎనికైనా, విశాఖ ఉక్కు విషయమైనా, అవినాష్ రెడ్డి( Avinash Reddy ) విషయమైనా, విషయం ఏదైనా సరే తనకు సంబంధంఉన్నా లేకపోయినా తెలుగు రాష్ట్రాలలోచర్చనీయాంశం అవుతున్న ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul )సంచలన విషయాలకు ఆయన నిజం గా ఎట్రాక్ట్ అవుతున్నారా? లేక ఆ విషయంలో తన ఉనికి ప్రదర్శిస్తే తనకు పొలిటికల్ మైలేజ్ వస్తుందని అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి .

తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది .

సి.బి.

ఐ వర్సెస్ అవినాష్ ( CBI )వ్యవహారం రోజురోజుకు ముదురుతుంది .ఈ రోజో రేపో ఆయన అరెస్టు తద్యమని ఒకవైపు వార్తలు వస్తుంటే ఆయన తల్లి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం కూడా వైసిపి పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది ఇప్పుడు సడన్గా ఆయన తల్లి వైద్యం తీసుకుంటున్న హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యారు కే ఏ పాల్ .

"""/" / ఆ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు పాల్ అవినాష్ రెడ్డి కుటుంబంతో తనకు ముందు నుంచి పరిచయం ఉందని ఆ పరిచయాలతో పరామర్శించడానికి మాత్రమే తాను వచ్చానని మీడియా ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించడం మానేసేయాలని ఏమీలేని విషయాలను కూడా ఏదో జరిగిపోతుందన్న బ్రమ మీడియా కల్పిస్తుంది అంటూ విలేకరులపై ఆయన విమర్శలు చేశారు.

"""/" / ఏది ఏమైనప్పటికీ ప్రతి హాట్ టాపిక్ ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆయన ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజలు ఆయనను నమ్మడం లేదు.

ఆయన కనీస ప్రతిపక్ష పార్టీగా కూడా గుర్తించడం లేదు.నోటాకు వచ్చిన ఓట్లు కూడా తెచ్చుకోలేకపోతున్నప్పటికీ ఆయన రాజకీయాలకు విరమణ ప్రకటించకుండా సీరియస్ గా ప్రయత్నించడం గమనార్హం.

ఏది ఏమైనా సంచలన విషయాలు తనకు ఓట్లు తీసుకురాలేదని కేఏ పాల్ గుర్తిస్తే మంచిదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు .

రోజూ ఈ జ్యూస్ తాగండి.. నాజూగ్గా మారండి..!