విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్న…కేఏ పాల్ ప్రకటన..!!
TeluguStop.com
ప్రజాశాంతి పార్టీ( Prajashanthi Party ) వ్యవస్థాపకుడు కేఏ పాల్( KA Paul ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన "మీట్ ది ప్రెస్" కార్యక్రమంలో కేఏ పాల్ మాట్లాడటం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో విశాఖ ఎంపీగా( Visakha MP ) ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
విశాఖకు చెందిన స్థానికుడి గానే తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో రానున్న రోజుల్లో విశాఖలోనే గడుపుతానని స్పష్టం చేశారు.
బీజేపీ పార్టీకి అన్ని రాజకీయ పార్టీలు తొత్తుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.ఇదిలా ఉంటే ఈ దసరా నుండి విశాఖ కేంద్రంగా పాలన చేయటానికి సీఎం జగన్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విశాఖ రాజధానిగా.త్వరలో తాను కూడా విశాఖకి మకాం మార్చబోతున్నట్లు పలు సందర్భాలలో కామెంట్లు కూడా చేయడం జరిగింది.
దీంతో వచ్చే ఎన్నికలలో విశాఖ నుండి పోటీ చేయడానికి చాలామంది రాజకీయ నేతలు ఉత్సాహపడుతున్నారు.
ఈ క్రమంలో కేఏ పాల్ వచ్చే ఎన్నికలనుండి పార్లమెంట్ కి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.
రోజుకొక ఉసిరికాయ తింటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా..?